కింగ్ నాగార్జున మరోసారి మన్మథుడిగా మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. 2002లో వచ్చిన మన్మథుడు చిత్రం నాగార్జున బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం మన్మథుడు2 తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్స్ లో నాగార్జున 60 ఏళ్ల వయసులో కూడా చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. 

ఆగష్టులో మన్మథుడు 2 రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉన్నప్పటికీ కొన్ని అంశాలు నాగార్జునని కలవరపెడుతున్నాయట. ఈ చిత్ర టీజర్ లో నాగార్జున లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. రెండవ టీజర్ లో రకుల్ పాత్రని బోల్డ్ గా ప్రజెంట్ చేశారు. సిగరెట్ తాగుతూ.. 'ఎ' సర్టిఫికెట్ చూపిస్తా అనే రకుల్ డైలాగ్స్ పై విమర్శలు వినబడుతున్నాయి. 

మన్మథుడు పేరుతో ఎక్కువవుతున్న రొమాన్స్ పై నాగార్జున సీరియస్ గా ఉన్నట్లు టాక్. తనకు ప్రధాన బలమైన ఫ్యామిలీ ఆడియన్స్ దూరం కాకూడదని, రొమాన్స్  సన్నివేశాలు తగ్గించాలని దర్శకుడిని కోరినట్లు తెలుస్తోంది.