నాకు ఆడవాళ్లు పట్ల పక్షపాతం ఉంది. అలా అని బలహీనత లేదని నాగార్జున చెప్పడం విశేషంగా మారింది. బిగ్ బాస్ వేదికపై నుండి నాగార్జున ఈ కామెంట్స్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 6 కి లాస్ట్ వీకెండ్ ఇది. నెక్స్ట్ సండే గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. విజేత బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్, యాభై లక్షల ప్రైజ్ మనీతో పాటు విలువైన బహుమతులు గెలుపొందనున్నాడు. ఈ వారం ఇనయా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అతి తక్కువ ఓట్లు పొందిన ఆదిరెడ్డి, ఇనయా డేంజర్ జోన్లోకి వచ్చారు. వారిలో ఆదిరెడ్డి సేవ్ అయినట్లు, ఇనయా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలియజేశారు.
మిగిలిన ఆరుగురు ఫైనల్ వీక్ కి వెళ్లారు. సాధారణంగా ఫైనల్ కి ఐదుగురు కంటెస్టెంట్స్ ని మాత్రమే పంపిస్తారు. అయితే నాగార్జున ఫైనల్ కి వెళ్ళేది ఐదుగురే, ఓ ట్విస్ట్ ఉందని షాక్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే హోస్ట్ నాగార్జున చేసిన ఒక కామెంట్ ఆసక్తికరంగా మారింది. సండే కావడంతో నాగార్జున కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించాడు. ఫస్ట్ ఒక క్విజ్ పెట్టారు. ఇంటిలో ఉన్న వస్తువుల సంఖ్య నాగార్జున అడుగుతారు.ఆన్సర్ తెలిసిన ఇంటి సభ్యులు గంట కొట్టి సమాధానం చెప్పాలి. రైట్ చెబితే వన్ మార్క్, తప్పు చెబితే మైనస్ మార్క్స్ పడతాయి.
ఈ గేమ్ స్టార్ట్ చేయబోతూ నాగార్జున లేడీ కంటెస్టెంట్స్ కి ఫేవర్ గా మాట్లాడారు. మాటల్లో మాటగా ఎవరూ అడగకుండానే... నాకు అమ్మాయిల పట్ల పక్షపాతం ఉంది అన్నారు. తన స్టేట్మెంట్ రాంగ్ టర్న్ తీసుకుంటుందని నాగార్జున భయపడినట్లు ఉన్నారు. వెంటనే స్పష్టంగా తన ఇంటెన్షన్ చెప్పాడు. నాకు అమ్మాయిలంటే పక్షపాతం ఉందన్నాడు, బలహీనత కాదు అని మరో కామెంట్ చేశాడు. నాగార్జున తన క్యారెక్టర్ గురించి అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా నాగార్జునకు పరిశ్రమలో మన్మధుడు అనే పేరుంది. ఆయన ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ తో సీరియస్ రిలేషన్స్ నడిపినట్లు పుకార్లు ఉన్నాయి.
