మీకు గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ మధ్యన  అఖిల్ హీరోగా మజ్నుగా అనే సినిమా వచ్చింది.పోయింది. ఆ సినిమాలో అఖిల్ ని మన్మధుడిగా చూపించి.. బాణం వేసిన ప్రతి అమ్మాయి పడకగదికి వెళ్ళిపోతుందన్నట్లుగా ఆ క్యారక్టర్ ని రాసుకున్నారు. అయితే ఆడియన్స్ ఇలాంటివి చాలా చూసాం వెళ్లిపోమన్నారు. సర్లే కుర్రాడు ..ఆవేశంలో ఏదో తప్పు చేసాడు అనుకుంటే ...ఎంతో ఎక్సపీరియన్స్ ఉన్న నాగ్ సైతం ఇలాంటి తప్పే చేసి షాక్ ఇచ్చాడు. 

రీసెంట్ గా మన్మధుడు2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ  సినిమాలో నాగార్జున పాత్ర జనాలకు షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో నాగ్ రొమాంటిక్ యాంగిల్. మిస్ ఫైరైంది. ఈ సినిమాలో నాగ్ క్యారక్టర్ ప్రకారం.. నాగార్జునకి రొమాన్స్ కు శృంగారానికి పెద్ద తేడా ఉన్నట్లు కనపడదు. ఓ ప్లేబోయ్ లా రెచ్చిపోతుంది.  చూసిన ప్రతి అమ్మాయిని అనుభవించేయాలనే యావతో అసంబద్దంగా బిహేవ్ చేస్తూంటాడు. మన్మధుడు2లో తను చేసింది ఓ ప్లేబోయ్ ..అంటే  స్త్రీలోలుడి పాత్రని రొమాంటిక్ రోల్ అనుకుని పొరపడటమే నాగ్ చేసిన తప్పు.  దానికి తోడు కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేయాలనుకున్ట్లుగా ..బెడ్ రూమ్ సీన్ లో  గోడలు వణికి పోవడం, వస్తువులు అదిరిపోవడం ఇలాంటి బీగ్రేడ్ షాట్స్ ని వేసి విరక్తి పుట్టించారు.
 
అఖిల్ సినిమా  ‘మిస్టర్ మజ్ను’లో కూడా అదే క్యారక్టరైజేషన్. ప్రతి అమ్మాయిని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళే వాడు.. ఉమనైజర్ అవుతాడు కానీ లవర్ కాదని ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా  ఏకిపారేసింది.  ఇప్పుడు నాగార్జున పరిస్దితి కూడా అదే.  మొత్తానికి మన్మధుడు2 నాగార్జునకి లేనిపోని బూతు ఇమేజ్ తెచ్చిపెట్టింది.