టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా ఫిక్సయిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ హంగామా మొదలుకానుంది. అయితే షోకి సంబందించిన రూమర్స్ డోస్ ఇంకా తగ్గడం లేదు. కంటెస్టెంట్ విషయంలో రోజుకో పుకారు షికార్లు కొడుతూనే ఉంది. 

ఆ సంగతి అటుంచితే.. ఈ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున కుదురుకోగలిగి ఆడియెన్స్ ని మెప్పిస్తే గనక మరో మూడు సీజన్లను ఈ హీరోతోనే నిర్వహించే ఆలోచనలో  నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే నాగార్జునకి కోట్లల్లో ఆదాయం దక్కనుంది. ఇప్పటికే ఎపిసోడ్ కి 40 లక్షలకు పైగా నాగ్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. 

అయితే గతంలో నాగ్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ఫ్యామిలీకి ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుకుంది. చాలా మంది కుర్ర హీరోలు ఉన్నప్పటికీ నాగ్ ని సెలెక్ట్ చేయడానికి ప్రధాన కారణం నాగ్ గత అనుభవమే. బిగ్ బాస్ అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలనీ నిర్వాహకులు నాగ్ ని సెట్ చేశారు. 

ఈ సీజన్ గనక క్లిక్కయితే మరో మూడు సీజన్స్ వరకు నాగార్జుననే హోస్ట్ గా కొనసాగించాలని అందుకు ఒప్పందం కూడా కుదుర్చుకోవాలని స్టార్ మా షో అధినేతలు ఆలోచిస్తున్నారట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.