Asianet News TeluguAsianet News Telugu

అల్లు అరవింద్ కు నాగ్ కండీషన్

గీతా గోవిందం వంటి హిట్ ని అల్లు అరవింద్ బ్యానర్ నుంచి వచ్చాక ...వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న కుమారుడు అఖిల్ ని తీసుకెళ్లి నాగార్జున ఆయన చేతిలో పెట్టారు. దాంతో ఓ అద్బుతమైన కథతో అల్లు అరవింద్ ...‘బొమ్మరిల్లు’  భాస్కర్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా చేసారు. రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కెరీర్ ప్రారంభం నుంచీ  ఇంతవరకు హిట్ అంటే తెలియని హీరోగా వెళ్తున్న అఖిల్ నాల్గవ సినిమాగా వస్తోంది ఈ చిత్రం. 

Nagarjuna puts a condition to Allu Aravind
Author
Hyderabad, First Published Aug 12, 2020, 5:53 PM IST

నాగార్జున లెక్కల్లో మనిషి. తను అనుకున్నది అనుకున్నట్లు జరిపించుకుంటారు. అవతలి వాళ్లు ఎవరైనా, ఎలాంటివాళ్లైనా తన కండీషన్స్ కు లోబడే వాళ్లతో కలిసి పనిచేస్తారు. అది నాగ్ బిజినెస్ లక్షణం. పర్శనల్ గా నాగ్ ఈ స్దాయిలో ఉండటానికి ఆ క్రమశిక్షణే కారణం అంటారు. నటుడుగా తెరపై కనిపించినంత ఈజీగా బయిట ఉండరు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నాగ్. ఈ విషయం అల్లు అరవింద్ కు తెలుసు. అయినా సరే ఓ కండీషన్ తో ఆయన్ని లాక్ చేసారంటున్నారు. 

వివరాల్లోకి వెళితే..గీతా గోవిందం వంటి హిట్ ని అల్లు అరవింద్ బ్యానర్ నుంచి వచ్చాక ...వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న కుమారుడు అఖిల్ ని తీసుకెళ్లి నాగార్జున ఆయన చేతిలో పెట్టారు. దాంతో ఓ అద్బుతమైన కథతో అల్లు అరవింద్ ...‘బొమ్మరిల్లు’  భాస్కర్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా చేసారు. రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కెరీర్ ప్రారంభం నుంచీ  ఇంతవరకు హిట్ అంటే తెలియని హీరోగా వెళ్తున్న అఖిల్ నాల్గవ సినిమాగా వస్తోంది ఈ చిత్రం. 

 ఈ సినిమా పై అక్కినేని ఫ్యామిలీ,అక్కినేని అభిమానులు ఆశలు మాములుగా పెట్టుకోలేదు. అయితే కరోనా దెబ్బతో రిలీజ్ ఆగింది. ఓ ప్రక్కన ఈ సినిమాని ఓటీటి ద్వారా రిలీజ్ చేయమని ప్రెజర్ వస్తోందిట. అరవింద్ కు ఆహా యాప్ సైతం ఉంది. దాంతో నాగార్జున చాలా క్లియర్ గా కండీషన్ పెట్టారట. ఎట్టి పరిస్దితుల్లోనూ సినిమాకు థియోటర్ రిలీజ్ ఉండాలని. ఓటీటిలో రిలీజ్ చేయవద్దని కోరారట. సరే అన్నారట అల్లు అరవింద్. 

చిత్రం కథ విషయానికి వస్తే... ఈ సినిమాలో అఖిల్ ఓ ఎన్నారై. తన వివాహం కోసం ఇండియాకు వస్తాడు. ఇక్కడ వరసపెట్టి అమ్మాయిలను చూస్తాడు. ఈ క్రమంలో పూజ హెగ్డే పరిచయం అవుతుంది. ఆమె తనకు ఫెరఫెక్ట్ అనుకుంటాడు. అయితే ఆమెతో సన్నిహితంగా మెలిగే కొలిదీ..కొన్ని క్వాలిటీస్ విషయంలో తప్పించి తనకు, ఆమెకు ఆమడ దూరం అని అర్దం చేసుకుంటాడు. ఆమె గురించి రోజు రోజుకీ నెగిటివ్ గా అనిపిస్తుంది. ఓ టైమ్ లో ఇంక ఆమె వద్దు అని డిసైడ్ అయ్యిపోయి..బ్రేకప్ చెప్పేస్తాడు. అయితే ఆ తర్వాత ఆమెపై ఉన్న ప్రేమ అతన్ని ఆమెలో తను నెగిటివ్ గా భావించే క్వాలిటీస్ ని పాజిటివ్ గా కనిపించేలా చేస్తుంది. పూర్తి ఫన్ తో, ఎమోషన్స్ తో ఈ సినిమాని రూపొందించారని చెప్తున్నారు. 
 
 తెలుగులో 'ఒంగోలుగిత్త' సినిమాకు దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు అఖిల్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  హీరోయిన్ పూజ హెడ్గే పాత్ర ఓ స్టాండప్ కమిడియన్ అని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగులో ప్రాచుర్యంలోకి వస్తున్నారు స్టాండప్ కమిడయన్స్. ఆ విషయం గమనించిన దర్శకుడు ట్రెండీగా ఉంటుందని ఆ పాత్రను హీరోయిన్ చేత చేయిస్తున్నారు.  
 
అఖిల్ ఈ సినిమాలో అప్పర్ మిడిల్ క్లాస్ యువకుడుగా కనిపించనున్నారు. గీతా గోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios