. సంక్రాంతి అయ్యిపోయినా ...ఆంధ్రాలో డ్రాప్ లేదు. డీసెంట్ కలెక్షన్స్ నడుస్తున్నాయి. మళయాళంలో మంచి సక్సెస్ సాధించిన పోరంజు మరియం జోస్ ‘Porinju Mariam Jose’కు ఈ చిత్రం రీమేక్ .
అక్కినేని నాగార్జునకు కొద్ది కాలంగా సక్సెస్ అనేది లేదు. అయితే సంక్రాంతికి ఆయన సినిమా హిట్ కొడతాను అనే నమ్మకంతో ఉన్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన నా సామి రంగ ప్రోమోలు చూస్తే పక్కా పండగ సినిమాలా కనిపించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా సామి రంగ.. నాగ్ కోరుకున్న విజయాన్ని అందించిందనే చెప్పాలి. . ఒక విలేజ్ డ్రామాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉండటమే కలిసొచ్చింది. కొత్త కథ.. గొప్ప మలుపులు.. వావ్ అనిపించే అంశాలు లేకపోయినా రెండున్నర గంటలు టైం పాస్ చేయడానికి అయితే ఇందులో ఢోకా లేదు. సంక్రాంతి అయ్యిపోయినా ...ఆంధ్రాలో డ్రాప్ లేదు. డీసెంట్ కలెక్షన్స్ నడుస్తున్నాయి. అయితే నైజాం లో మాత్రం పూర్తి డ్రాప్ కనపడుతోంది.
ఈ చిత్రం నాలుగురోజులు కలెక్షన్స్ విషయానికి వస్తే..
👉నైజాం : 3.88Cr
👉సీడెడ్ : 2.68Cr
👉ఉత్తరాంధ్ర: 2.14Cr
👉ఈస్ట్ గోదావరి: 1.81Cr
👉వెస్ట్ గోదావరి: 88L
👉గుంటూరు: 1.12Cr
👉కృష్ణా : 89L
👉 నెల్లూరు: 65L
ఆంధ్రా తెలంగాణా టోటల్ :- 14.05CR(23.15CR~ Gross)
👉కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా: 0.50Cr
👉ఓవర్ సీస్ : 0.45Cr
మొత్తం ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ :- 15.00CR(25.35CR~ Gross)
సినిమా ఓవరాల్ బిజినెస్ = 18.20Cr
బ్రేక్ ీవెన్= 19Cr~
*మరో 4.00Cr వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది
రోజు 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ — 4.70CR~(7.80CR~ Gross)
రోజు 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ — 4.13CR~(6.85CR~ Gross)
రోజు 3 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ — 3.56CR~(6.05CR~ Gross)
రోజు 4 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ — 2.61CR~(4.65CR~ Gross)
నా సామిరంగా..వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
👉నైజాం : 5Cr
👉సీడెడ్ : 2.2Cr
👉ఆంధ్రా: 8Cr
ఆంద్రా- తెలంగాణా టోటల్ :- 15.30CR
👉ఓవర్ సీస్ – 2Cr
మొత్తం ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ : 18.20CR(BREAK EVEN – 19CR+)
గమనిక : ఈ భాక్సాఫీస్ కలెక్షన్స్ రకరకాల సోర్స్ నుంచి తీసుకున్నవి..ఇవే కరెక్ట్ అని చెప్పలేము. కాకపోతే దగ్గరగా ఉండే అవకాసం ఉంది.
నాగార్జున (Nagarjuna) ఘోస్ట్ మూవీ తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న చేసిన సినిమా నా సామిరంగ (Naa Saami Ranga). నాగ్ 99వ (Nag 99) చిత్రంగా వచ్చిన ఈ సినిమాకు విజయ్ బిన్ని దర్శకత్వం వహించగా, ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. నా సామిరంగ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో నిలిపారు మేకర్స్.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రైట్స్ 18 కోట్లకు అమ్ముడుపోయాయని వినికిడి. ఇది తెలుగు సినిమా వరకూ రికార్డ్ ప్రైస్ అనే చెప్పాలి. డిస్నీ హాట్ స్టార్ Disney Hotstar వారు ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. నాగార్జున సినిమాలు ఓటిటి లో బాగా వెళ్లటం, బిగ్ బాస్ ఎఫెక్ట్ తో ఈ రేటు వచ్చిందని తెలుస్తోంది. సాధారణంగా రీమేక్ చిత్రాలకు ఈ రేటు పలకదు. మళయాళంలో మంచి సక్సెస్ సాధించిన పోరంజు మరియం జోస్ ‘Porinju Mariam Jose’కు ఈ చిత్రం రీమేక్ .
