`మన్మథుడు` నాగార్జున నేడు(ఆదివారం) తన 62వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ వచ్చింది. `ఘోస్ట్` పేరుతో రూపొందుతున్న ఈ సినిమా లుక్ ని విడుదల చేశారు.

ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచే నాగార్జున ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి `ది ఘోస్ట్` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అంతేకాదు నేడు(ఆదివారం ఆగస్ట్ 29) నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో కత్తికి రక్తం కారుతుండగా, వర్షంలో జెంటిల్‌మెన్‌లా నిలబడి ఉండగా, ఆయని లొంగిపోతున్నట్టుగా ప్రత్యర్ధులు తలవంచే లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హాలీవుడ్‌ స్టయిల్‌లో ఘోస్ట్ ప్రధానంగా సాగే డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నాగార్జున, కాజల్‌ ఫస్ట్ టైమ్‌ కలిసి నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 

Scroll to load tweet…