చైతుని చూస్తే అసూయగా ఉంది: నాగ్

First Published 10, May 2018, 5:54 PM IST
nagarjuna is jealous about nagachaitanya
Highlights

సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మహానటి' సినిమాలో టాలీవుడ్ కు చెందిన పలువురు 

సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మహానటి' సినిమాలో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలో పోషించారు. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు, జెమినీ గనేషన్ గా దుల్కర్ సల్మాన్, కెవి రెడ్డిగా క్రిష్, ఎల్వీ ప్రసాద్ గా అవసరాల శ్రీనివాస్ లు నటించారు. ఇక సావిత్రి కోస్టార్స్ అయిన అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య కనిపించడం విశేషం. అయితే దీనికి సంబంధించి ఒక వీడియోను సిద్ధం చేసిన చిత్రబృందం సినిమా రిలీజ్ తరువాత ఈ వీడియోను విడుదల చేసింది.

ఇందులో నాని వాయిస్ ఓవర్ తో సాగిన స్పీచ్ ఏఎన్నార్గొప్పతనాన్ని తెలియజేస్తోంది. ఈ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిన అక్కినేని నాగార్జున ''తండ్రిగా గర్వపడుతున్నా.. కొడుకుగా అసూయ పడుతున్నా.. నాన్నగారి పాత్రలో నేను ఇప్పటివరకు నటించలేదు. కానీ ఆ పాత్రలో చైతు నటించడం ఆనందంగా అనిపిస్తోంది. చైతు  అద్భుతంగా నటించాడు'' అని తెలిపారు.  కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.   

loader