కింగ్ నాగార్జున ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు.
కింగ్ నాగార్జున ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ సినిమా నుంచి చిరంజీవి, రజినీకాంత్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి దిగ్గజాలు పాల్గొన్నారు. ప్రధాని మోడీ ప్రారంభ వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున కూడా వేవ్స్ సమ్మిట్ లో సందడి చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ స్టాల్ ని తన చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఆ తర్వాత నాగార్జున కార్తీ, ఖుష్బూ, అనుపమ్ ఖేర్ తో కలసి ఇండియన్ సినిమాకి సంబంధించిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్ లాంటి సంచలన చిత్రాల గురించి నాగార్జున ప్రత్యేకంగా ప్రస్తావించారు. 90 శాతం మంది ప్రేక్షకులు సినిమాకి వెళ్ళేది తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి.
స్క్రీన్ పై జరిగే మ్యాజిక్ ని చూడడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఈ జనరేషన్ ఆడియన్స్ హీరోలని సూపర్ హీరోలుగా, లార్జర్ దేన్ లైఫ్ పాత్రల్లో చూడడానికి ఇష్టపడుతున్నారు. బాహుబలి, పుష్ప, కేజిఎఫ్ చిత్రాలు అందుకే విజయం సాధించాయి. పుష్ప చిత్రం అయితే తెలుగులో కంటే నార్త్ లో ఎక్కువ వసూళ్లు రాబట్టింది. నాకు కూడా పుష్ప, బాహుబలి లాంటి చిత్రాలంటే ఇష్టం అని నాగార్జున అన్నారు.
బాహుబలి చిత్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది అని నాగార్జున అభినందించారు. నాగార్జున ప్రస్తుతం రజనీకాంత్ కూలీ, శేఖర్ కమ్ముల కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు. నా సామిరంగ చిత్రం తర్వాత నాగార్జున సోలో హీరోగా కొత్త చిత్రాన్ని ఇంకా ప్రారంభించలేదు.


