గెట్ రెడీ: ఇది నాగ్ ‘యమగోల’...‘రంభ’ తో రచ్చ
యమలోకం సెటప్ తో నాగార్జున మన ముందుకు రావటానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఆ వివరాలు..
అది 1977.. అప్పటికే అన్నగారు పెద్ద ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయి..వెళ్తున్నాయి..కానీ ఒకప్పటిలా మాత్రం పెద్ద హిట్ అవటం లేదు. బ్లాక్‌బస్టర్స్ అంటున్నారు కానీ బాక్సాఫీస్ బద్దలైపో పోవటం లేదు.కృష్ణ, శోభన్ బాబులు వచ్చి ఇండస్ట్రీని దున్నేసే పోగ్రాం పెట్టుకున్నారు. అప్పుడు అన్నగారు తీసుకున్న ఓ డెసిషన్ తో ...సినిమా ఇండస్ట్రీలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. నందమూరి అభిమానులు కూడా తమ హీరో కు సరైన సినిమా పడాలి అని ఎదురు చూస్తున్న సమయంలో ఆ సినిమా వచ్చింది. అదే యమలీల. అప్పట్లోనే 3.25 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు అలాంటి టైమే నాగ్ ది. సరైన హిట్ కావాలి. అందుకేనేమో యమలోకం సెటప్ తో ఆయన మన ముందుకు రావటానికి రంగం సిద్దం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే...నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయనలో నాగ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. రాముగా, బంగార్రాజు గా నటించిన ఆకట్టుకున్నాడు నాగార్జున. అలాగే నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ , యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ నటించారు.ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు క్యారెక్టర్ తో సినిమాను ప్లాన్ చేసుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్‌గా బంగార్రాజు తెరకెక్కుతోంది.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. బంగార్రాజు సినిమాలో స్వర్గంలో పెద్ద ఎపిసోడ్ ఉంది. ఫస్టాఫ్ లో ఈ ఎపిసోడ్ హైలెట్ గా ఉండనుంది. ఇంటర్వెల్ ముందు దాకా ఈ ఎపిసోడ్ ఉండనుంది. ఈ ఫాంటసీ ఎపిసోడ్‌లో ఒక పాట ఉంటుంది. ‘యమగోల’ ‘యమలీల’ తరహాలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సరదా ఎపిసోడ్‌ని రూపొందిస్తున్నారు. మోనాల్ గజ్జర్ భాగం ఈ ఎపిసోడ్‌లో కనిపిస్తుంది. స్వర్గంలో ఉండే రంభ పాత్రలో నటిస్తోంది. నాగార్జునతో కలిసి ఒక పాటలో నర్తించనుంది. ఈ నెలాఖరులో సినిమా ప్రారంభమవుతుంది.
నాగార్జున రీసెంట్ గా వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా థియోటర్స్ అసలు ఆడలేదు. ఓటీటిలో మంచి టాక్ ను తెచ్చుకుంది. దర్శకుడు అహిషోర్ సాల్మోన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్. నాగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్గా నటించింది.