బిగ్ బాస్ నిర్వాహకులకు షాక్ ఇచ్చిన నాగార్జున తన సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి చెక్కేశారు. దీనితో ఆయన ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ గా కూడా కనిపించలేదు. శనివారం అయినప్పటికీ నేడు నాగార్జున షోలో దర్శనమివ్వలేదు . దీనితో బిగ్ బాస్ ప్రేక్షకులు కొంత నిరాశకు గురయ్యారు. 

ఐతే షో బిగినింగ్ లోనే నాగార్జున దీనిపై క్లారిటీ ఇచ్చాడు. తాను వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులు మనాలి వెళ్లినట్లు చెప్పాడు. కులు మనాల్ నందుకు గల రోహ్ తంగ్ పాస్ నందు నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ నిర్వహిస్తున్నట్లు 3000 అడుగులకు పైగా హైట్ లో కఠిన పరిస్థితుల మధ్య వైల్డ్ డాగ్ షూటింగ్ జరుపుతున్నట్లు ఆయన తెలియజేశారు. 

దీనితో ఈ శనివారం బిగ్ బాస్ ప్రేక్షకులు కింగ్ నాగార్జునను మిస్ అయ్యారు. ఆయన ఎంట్రీ ఆశించిన ప్రేక్షకులకు నిరాశఎదురైంది. ఐతే బిగ్ బాస్ నిర్వాహకులు షోని అత్యంత ఆసక్తి కరంగా మార్చారు . ఇంటి సభ్యులతో ఓ లవ్ స్టోరీ నిర్మించి ప్రెజెంట్ చేశారు. మోనాల్, అఖిల్, ఆరియానా మరియు అవినాష్ మధ్య ఓ అందమైన లవ్ స్టోరీ నిర్మించి చూపించారు. ప్రేమ మొదలైంది పేరుతో నిర్మించిన ఆ లవ్ స్టోరీ బాగా ఆకట్టుకుంది. 

ఇక రేపు కూడా నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా కనిపించడు. నాగార్జున స్థానాన్ని రేపు హీరోయిన్ సమంత భర్తీ చేయనుంది. రేపు సండే బిగ్ బాస్ హోస్ట్ గా సమంత ఎంట్రీ ఇవ్వ నుంది. దీనితో బిగ్ బాస్ ప్రేక్షకులకు ఆమె హోస్టింగ్ పై అమితాసక్తి ఏర్పడింది.