ఈ షోకి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున పారితోషికం ఎంతనేది ఆసక్తికరంగా మారింది. టీవీ ప్రసారమయ్యే షోకి సంబంధించిన నాగార్జున వారానికి రెండు రోజుల్లో వస్తారు. 

బిగ్‌బాస్‌ రియాలిటీ షోకి హోస్ట్ గా నాగార్జున(Nagarjuna) ఫిక్స్ అయిపోయారు. నిజానికి టీవీ షోలకు హోస్ట్ గా నాగ్‌ బెస్ట్ అనే అభిప్రాయం ఉంది. అన్ని రకాల ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ, చాలా హుందాగా షోని నిర్వహిస్తూ రాణిస్తున్నారు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి సమాధానం ఇవ్వాలో బాగా తెలిసిన వ్యక్తిగా, ఏ విషయాన్ని ఎంత వరకు చర్చించాలో, ఏ కంటెస్టెంట్‌ని ఎక్కడ కట్‌ చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఎవరికి ఎంకరేజ్‌ చేయాలో కూడా నాగ్‌కి స్పష్టత ఉంటుంది. 

అయితే `బిగ్‌బాస్‌ తెలుగు 5` సీజన్‌లో హోస్ట్ గా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు nagarjuna. కొందరి కంటెస్టెంట్లకి ఫేవర్‌గా వ్యవహరించాడని, మరికొందరిని టార్గెట్‌ చేశారనే టాక్‌ వినిపించింది. హోస్ట్ గా నాగ్‌ ఫిట్‌ కాదనే ట్రోల్స్ ని కూడా ఎదుర్కొన్నారు. కానీ ఏదేమైనా ఇప్పుడు బిగ్‌బాస్‌ షోకి ఆయనే బెస్ట్ హోస్ట్ గా నిలుస్తున్నారు. రెండు రోజుల క్రితం బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ(Bigg Boss Telugu OTT) షో ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనికి నాగార్జున హోస్ట్(Nagarjuna Host) గా వ్యవహరిస్తున్నారు. 

అయితే మెయిన్‌ స్ట్రీమ్‌ రియాలిటీ షో కంటే ఓటీటీ బిగ్‌బాస్‌ షో టైమ్‌ పీరియడ్‌ తక్కువ. ఎనభై రోజులే ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇది 24గంటలు ప్రసారమవుతుంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ షో రన్‌ అవుతుంది. `బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌` పేరుతో ఈ షో రన్‌ అవుతుంది. కొత్తవారిని, పాతవారిని కలిపి 17 మంది కంటెస్టెంట్లతో ఈ షోని నిర్వహిస్తున్నారు. 

 అయితే ఈ షోకి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున పారితోషికం(Nagarjuna Remunaration) ఎంతనేది ఆసక్తికరంగా మారింది. టీవీ ప్రసారమయ్యే షోకి సంబంధించిన నాగార్జున వారానికి రెండు రోజుల్లో వస్తారు. శని, ఆది వారాలు ఆయన సందడి చేస్తారు. కానీ ఓటీటీ బిగ్‌బాస్‌ లో మాత్రం కేవలం శనివారం మాత్రమే వ్యాఖ్యాతగా స్క్రీన్‌పై కనిపించనున్నాడు. ఈ క్రమంలో నాగార్జున బిగ్‌బాస్‌ ఓటీటీ కోసం ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

గత సీజన్‌కు సుమారు రూ.12 కోట్ల వరకు నాగార్జున రెమ్యూనరేషన్‌గా అందుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే సారి తగ్గించారు. దాదాపు రూ.తొమ్మిది కోట్లు పారితోషికంగా నాగార్జున అందుకోబోతున్నారట. అయితే టీవీలో ప్రసారం అయ్యే షో కంటే ఇది ఎక్కువే అని చెప్పొచ్చు. అది 15 వారాలు వస్తుంది. పైగా వారానికి రెండు రోజులు అంటే మొత్తంగా 30 రోజులు నాగార్జున కనిపించేవారు. కానీ ఓటీటీ లో ప్రసారమయ్యే షో కేవలం ఎనభై రోజులే అని, అందులోనూ నాగ్‌ వారానికి ఒక్క రోజే అంటూ కనిపించనున్నారు. ఈ లెక్కన మొత్తం షోలో నాగార్జున కేవలం 11గానీ, 12 రోజులు మాత్రమే కనిపిస్తారు. ఈ లెక్కన ఆయనకు గతంలో కంటే ఎక్కువే తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.