సినిమాలపై కూడా ట్విట్టర్‌ ప్రభావం గట్టిగానే ఉంది.  ఇటీవల సంక్రాంతికి వచ్చిన సినిమాల విషయంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ  నేపథ్యంలో కింగ్‌ నాగార్జున హాట్‌ కామెంట్‌. 

సోషల్‌ మీడియా ప్రభావం ఇటీవల చాలా ఉంటుంది. వ్యక్తుల అభిప్రాయాల విషయంలో అది ప్రతిబింబిస్తుంది. సమాచారాన్ని వేగంగా బదిలి చేస్తుంది. సమాచారం కోసం ఉపయోగపడటమే కాకుండా, నెగటివ్‌ అభిప్రాయాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. బీభత్సమైన ట్రోల్‌ జరుగుతుంది. నచ్చని విషయాలను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ట్విట్టర్‌(ఎక్స్) ఇప్పుడు సమాచారం విషయంలో, అభిప్రాయాల విషయంలో టాప్‌లో ఉంది. దాని చుట్టూతే అంతా నడుస్తుంది. ట్విట్టర్‌ కారణంగా రాజకీయాలు మార్చేలా, అధికారాలు మార్చేస్తున్నాయి. 

సినిమాలపై కూడా ట్విట్టర్‌ ప్రభావం గట్టిగానే ఉంది. అయితే ఇటీవల నెగటివిటీ ఎక్కువైందనే కామెంట్లు వస్తున్నాయి. ఇటీవల సంక్రాంతికి వచ్చిన సినిమాల విషయంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కింగ్‌ నాగార్జున హాట్‌ కామెంట్‌. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియాలో నెగటివ్‌ కామెంట్లు, ట్రోల్స్ పై స్పందిస్తూ హాట్‌ కామెంట్‌ చేశారు. ట్విట్టర్‌ ఇప్పుడు వరస్ట్ గా తయారైందన్నారు. 

`ట్విట్టర్‌ అనేది పూర్తిగా నెగటివ్‌ ట్రెండ్‌లోకి వెళ్లిపోయింది. తాను జాయిన్‌ అయినప్పుడు ఇలా లేదు. చాలా వరకు వాళ్లంతా ఒక చీకటి రూములో కూర్చొని, వాడు చెప్పాల్సినవన్నీ చెప్పేస్తున్నాడు. మనమేమో ఆగం అయిపోతున్నాం. అందుకే సగానికిపైగా నా లైఫ్‌లో వాటికి దూరంగా ఉంటున్నాను. ఎందుకీ హెడెక్‌. ఇప్పుడు అవసరమా ఇవి నాకు అనిపిస్తుంది` అని తెలిపారు నాగార్జున.

చాలా వరకు సెలబ్రిటీలు కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. అయితే చాలా వరకు ట్విట్టర్‌ సినిమా ప్రమోషన్లకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈజీగా ఆడియెన్స్ కి చేరుతుంది. ఎంత ఉపయోగం ఉందో, నెగటివ్‌ కూడా అంతే ఉంది. దాన్ని ఆపడమనేది ఇప్పుడు చాలా కష్టంగా మారింది. ఇక ప్రస్తుతం నాగార్జున ప్రస్తుతం `నా సామిరంగ` అనే సినిమాలో నటించారు. విజయ్‌ బిన్ని దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రలు పోషించారు. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. 

Scroll to load tweet…