హిమాలయాలకు వెళ్తున్న నాగ్..కారణం
నాగార్జున హీరోగా అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ సినిమా ఆరు నెలల లాక్‌డౌన్ విరామం తరువాత మళ్లీ పట్టాలెక్కింది. దీన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది.
ఆ మధ్యన రజనీకాంత్ ఖాళీ దొరికినప్పుడల్లా హిమాలయాలు టూర్ పెట్టుకునేవారు. అలా నాగార్జున కూడా బయిలుదేరుతున్నారా అనే డౌట్ మీకు వస్తే అక్కడితో ఆపేయండి. ఆయన తన తాజా చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం హిమాలయాలకు ప్రయాణం పెట్టుకున్నారు. బిగ్ బాస్ వీకెండ్ షూట్ ఫినిష్ చేసుకుని ఆయన అక్కడకు చేరుకుంటారు. మనాలి చుట్టు ప్రక్కల ఏరియాల్లో ఈ చిత్రం షూటింగ్ ని ప్లాన్ చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
నాగార్జున హీరోగా అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ సినిమా ఆరు నెలల లాక్‌డౌన్ విరామం తరువాత మళ్లీ పట్టాలెక్కింది. దీన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది.
ఇందులో నాగార్జున ఏసీపీ విజయ్ వర్మ అనే శక్తిమంతమైన పోలీస్ పాత్ర పోషిస్తున్నారు. కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్ కోసం రంగంలోకి దిగుతారు విజయ్ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన ఎలా మట్టు పెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్’ చిత్రం చూడాల్సిందే.
‘‘వాస్తవ ఘటనల ఆధారంగా అల్లిన కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగ్ ఓ భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో నాగ్ ‘వైల్డ్‌డాగ్’ బృంద సభ్యులుగా అలీ రెజా, ఆర్యా పండిట్, కాలెబ్ మాథ్యూస్, రుద్రా గౌడ్, హష్వంత్ మనోహర్ కనిపించనున్నారు. సయామీ ఖేర్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంద’’ని చిత్ర టీమ్ తెలిపింది.
మరో ప్రక్క ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు నాగ్. అదొక యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్న సినిమా అని సమాచారం. విజయవంతమైన ‘గరుడవేగ’ తర్వాత ప్రవీణ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే.