అక్కినేని కుటుంబానికి ఈ మధ్య కాలంలో  కాస్త కలిసి రావటం మొదలైంది. నాగచైతన్య సినిమాలు బాగానే ఆడుతున్నాయి. సమంత సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. నాగార్జున కొత్త చిత్రాలకు సైతం క్రేజ్ వస్తోంది. ఇలా అనటానికి కారణం లాస్ట్ ఇయిర్ అంటే 2018లో నాగార్జునకు దారుణమైన ప్లాఫ్ ఆఫీసర్ తో పలకరించింది. దేవదాసు సైతం నిరాశపరిచింది. మరో ప్రక్క అఖిల్ సినిమాలు ఏమీ ఆడలేదు. నాగచైతన్య సవ్యసాచి అదే పరిస్దితి. దాంతో నాగ్  ఆ ప్లాఫ్ నీడలనుంచి బయటపడుతున్న వెళ అసలు  అందుకు కారణం ఏమిటి అనేది విశ్లేషించుకున్నారట. దాంతో తన నాగచైతన్య, అఖిల్ ఇద్దరిని పిలిచి  ఓ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. 

ఓ పాపులర్ యూట్యూబ్ ఛానెల్ కథనం ప్రకారం....షూటింగ్ అప్పుడు షెడ్యూల్ టైమ్ కన్నా మినిమం పది నిముషాలు అయినా ముందు ఉండమని చెప్పారట.  తాను ఆ పాలసీతో ముందుకు వెళ్లినంతకాలం తన డైరక్టర్స్ హ్యాపీ, తోటి కొలీగ్స్ హ్యాపీ అని, అంతేకాక, చేయబోయే సీన్ పై కాసేపు డిస్కస్ చేసుకుని, ఏమన్నా ఇంప్రవైజ్ చేసేందుకు అవకాసం ఉంటుందేమో అని క్రాస్ చెక్ చేసుకునేందుకు అవకాసం ఉంటుందని చెప్పారట. 

హడావిడిగా అసెస్టెంట్ డైరక్టర్ పిలిచాక సెట్ లోకి పరుగెడితే ..డైరక్టర్ చెప్పింది చేయటం తప్ప వేరే ఆప్షన్ ఉండదని, క్యారక్టర్ లోకి వెళ్లాలంటే కొద్దిగా హోమ్ వర్క్ చేయాల్సిందే అని చెప్పారట. అలా చేస్తే సినిమా ఫలితం ఎలా ఉన్నా , ఖచ్చితంగా నటనకు మార్కులు పడతాయని అన్నారట. అలా చేయకపోతే మన కెరీర్ ని మనమే చేతులారా పాడు చేసుకున్నట్లు అవుతుందని, లాంగ్ రన్ ఉండాలంటే అవసరాన్ని మించి కష్టపడాలని సూచించారట. అలాగే ఇప్పుడు  సమంత అదే చేస్తోందని , అదే ఆమె విజయ రహస్యమని,  ఓ బేబికి ఆమెకు మంచి ప్రశంసలు వస్తున్నాయని మెచ్చుకున్నారట. మరి అఖిల్, నాగ చైతన్యలను ఈ విషయాన్ని ఎంతవరకూ సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.