అక్కినేని అఖిల్ హీరోగా 'గీతాఆర్ట్స్ 2' బ్యానర్ పై ఓ సినిమా ప్రారంభం కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ని అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ లో నాగార్జున కూడా పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రాజెక్ట్ పై నమ్మకంతో నాగ్ ఈ సినిమాపై డబ్బు పెట్టడం లేదు.. అసలు విషయమేమిటంటే.. అల్లు అరవింద్ ఈ సినిమా కోసం ఫిక్స్ చేసిన బడ్జెట్ కంటే ఇంకాస్త ఎక్కువ ఖర్చు అవుతుందట. అయితే అఖిల్ సినిమాపై అంత బడ్జెట్ పెట్టనని,ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలని అరవింద్ సూచించాడట.

దీంతో నాగార్జున సీన్ లోకి ఎంటర్ కావాల్సివచ్చింది. అసలే సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు అఖిల్. ఇలాంటి సమయంలో అఖిల్ తదుపరి సినిమావిషయంలో క్వాలిటీ తగ్గితే అదొక మైనస్ పాయింట్ అవుతుందని.. మేకింగ్ విషయంలో రాజీ పడొద్దని,, అదనపు బడ్జెట్ భారం తాను చూసుకుంటానని చెప్పాడట నాగార్జున.

ఈ సినిమాకి మొదట దేవిశ్రీప్రసాద్ ని నిర్మాతగా అనుకున్నారు. కానీ ఫైనల్ గా గోపిసుందర్ ని కన్ఫర్మ్ చేశారు. హీరోయిన్ గా మాత్రం క్రేజ్ ఉన్న అమ్మాయిని తీసుకోవాలని చూస్తున్నారు.