చిరంజీవి స్వయంగా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తన సినిమాని నాలుగైదు సార్లు చూసుకుని, లాగ్ లు లేకుండా ఎక్కడా బోర్ కొట్టకుండా ఎడిట్ చేయించుకోవటం అలవాటు అని చెప్తారు. ఆయన అనుభవం అందుకు వందకు వంద శాతం సహకరిస్తుంది. ఏదన్నా లింక్ లు తెగినా రిపేర్లు చేసుకోవటానికి కూడా అనువుగా ఉంటుందని ఎడిటింగ్ టేబుల్ వద్ద ఎక్కువ సేపు గడుపుతారు. ఏదో కాలక్షేపం గా వెళ్లరు. సిన్సియర్ గా ఆ పనిమీద ఉంటారని చెప్తారు. ఇప్పుడు అదే విధంగా నాగార్జున కూడా కష్టపడుతున్నారట. 

తన తాజా చిత్రం  `మన్మధుడు 2` విషయంలో చిరునే ఫాలో అవుతున్నారట. రోజూ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ప్రత్యక్ష్యమవుతున్నారట. రాహుల్ కన్నా ఎక్కువ శ్రద్ద ని నాగ్ చూపెట్టడం చూసి టీమ్ ఆశ్చర్యపోతోందిట. దాదాపు 15 నిముషాలు పాటు ఫైనల్ కట్ నుంచి మళ్లీ ఎడిట్ చేయించారని తెలుస్తోంది. ఫన్ పండినా, ఫ్లోకు అడ్డం వస్తోందని సినిమా అక్కడ ఆగిపోతోందని అనుకున్న చోట నిర్దాక్ష్యణంగా తీయించేసారట. సినిమా రిలీజ్ అయ్యాక తీరిగ్గా ట్రిమ్ చేసుకునే కంటే ఇప్పుడే ఆ పని చేయటం బెస్ట్ అని అభిప్రాయపడి ఈ పని చేస్తున్నారు.

ఇక రకుల్ హీరోయన్ గా చేస్తున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. నాగార్జున- జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు.. టీజర్ .. లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్  వచ్చింది. నాగార్జున ఘాటైన రొమాన్స్ గురించి యూత్ లో చర్చ మొదలైంది.  రొమాన్స్ లో అప్పటితో పోలిస్తే ఇంకా అనుభవం పెరిగిందని నాగ్ చెప్పిన మాటలు వైరల్ అయ్యి సినిమా ప్రమోషన్ కు ఉపయోగపడనున్నాయి.