భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. చిత్రం నుంచి తాజాగా కింగ్ నాగార్జున్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం `బ్రహ్మాస్త్ర`(Brahmastra). రణ్‌బీర్ కపూర్, అలియాభట్ (Alia Bhatt) జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున(Nagarjuna), మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ ను ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం చేస్తున్నా మేకర్స్. ఈ సందర్భంగా వరుస అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
తాజాగా "బ్రహ్మాస్త్రం" నుండి కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నాగార్జున సైంటిస్ట్ పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. అతేంద్రియా శక్తులను కలిగి ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు అర్థమవుతోంది. పోస్టర్ నాగార్జున రోల్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. అయితే ఇంత పెద్ద చిత్రంలో తనను భాగస్వామ్యం చేసినందుకు దర్శకుడు అయాన్ ముఖర్జీకి కింగ్ నాగార్జున ట్వీటర్ వేదికన ధన్యవాదాలు తెలిపారు. ‘బ్రహ్మాస్త్రం ఒక అద్భుతమైన శక్తి ప్రపంచం. ఆ అద్భుతంలో భాగమైనందుకు నేను గర్విస్తున్నాను. నంది అస్త్రం శక్తితో దాని శక్తిని నా చేతిలో పట్టుకున్నాను.! మీ ప్రపంచం, అభిరుచి, మీ అంతులేని శక్తిలో నన్ను ఒక భాగం చేసినందుకు అయాన్ కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని కాస్తా ఎమోషన్ గా ట్వీట్ చేశారు.
ఇక ఈ చిత్రం నుంచి జూన్ 15న బ్రహ్మస్త్ర ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన చిత్రాన్ని అక్టోబర్ 9న రిలీజ్ చేయనున్నారు. హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు.
రీసెంట్ గా రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ S. S. రాజమౌళితో కలిసి "బ్రహ్మాస్త్రం" సినిమా ప్రచారంలో భాగంగా విశాఖపట్నం నగరాన్ని సందర్శించారు. సినిమాపై దేశమంతటా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తుండటం, కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించడంతో ఆడియెన్స్ ఈ చిత్రం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
