Asianet News TeluguAsianet News Telugu

చిరు పాటకు చిందేసిన నాగార్జున.. వైరల్ అవుతున్న వీడియో.!

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తాజాగా చిరంజీవి సినిమాల పాటకు అదిరిపోయేలా డాన్స్ చేశారు. నాగ్ వేసిన స్టెప్పులు చిరుకు కూడా జోష్ తెప్పించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట  వైరల్ గా మారింది.
 

Nagarjuna Dance to Chiranjeevi Song, video is Going Viral.!
Author
First Published Sep 25, 2022, 6:36 PM IST

తెలుగు చలన  చిత్ర పరిశ్రలో సీనియర్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వీరిద్దరూ స్టార్ హీరోలే కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా తెలిసిన విషయమే. ప్రస్తుతం వీరిద్దరి చిత్రాలు ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయి. నాగార్జున నటించిన ది గోస్ట్ (Ghost) చిత్రం, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం  అక్టోబర్ 5న ఒకే రోజున  విడుదల కాబోతున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తుండగా.. తాజాగా నాగ్ మరోషాక్  ఇచ్చారు. చిరంజీవి సాంగ్ కు స్టెప్పులేశారు. అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీశారు.

కింగ్ నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 6 ప్రస్తుతం ఆసక్తికరంగా కొనసాగుతోంది. హౌజ్ లోని కంటెస్టెంట్లు హోరాహోరీగా తలపడుతున్నారు. మరోవైపు నాగార్జున కూడా హౌజ్ మేట్స్ లో మరింత జోష్ నింపేందుకు తాజాగా డాన్స్ తో అదరగొట్టారు. లేటెస్ట్ ఎపిసోడ్ లో నాగార్జున వేసిన స్టెప్పలు నెటిజన్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎపిసోడ్ ఎపిసోడ్ కు నాగార్జున కొత్తదనంతో అలరిస్తుండటం ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది.  

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’ (Godfather). ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన మాస్ సాంగ్ ‘థార్ మార్ థక్కర్  మార్’ (Thaar Maar Thakkar Maar) దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జున కూడా Bigg Boss Telugu 6 లేటెస్ట్ ఎపిసోడ్ లో స్టెప్పులతో అదరగొట్టాడు. దీంతో కొద్ది సేపట్లోనే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇప్పటికే ఇద్దరు మెగాస్టార్లు కలిసి చిందులేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. తాజాగా నాగార్జున కూడా స్టెప్పులేయడం ఫ్యాన్స్ కు మరింత జోష్ నిస్తోంది.

మరోవైపు అక్కినేని నాగార్జున నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘ది గోస్ట్’ (Ghost) ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలను చిత్ర యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. ఈరోజు కర్నూల్ జిల్లాలోని కాలేజీ గ్రౌండ్ లో  ‘ది గోస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. మరికాసేపట్లో ఈవెంట్  కూడా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో  నాగార్జున - సోనాల్ చౌహాన్ జంటగా నటించారు. అక్టోబర్ 5న గ్రాండ్ గా రిలీజ్  కానుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios