Asianet News TeluguAsianet News Telugu

#Ghost: చిరు "గాడ్ ఫాదర్" పైకి నాగ్ "బ్రహ్మాస్తం"

సీనియర్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ కి సిద్ధమవుతున్నాయి. అవే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "గాడ్ ఫాదర్" మరియు కింగ్ నాగార్జున నటించిన "ది ఘోస్ట్" సినిమాలు. మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" అనే సినిమాకి రీమేక్ గా "గాడ్ ఫాదర్" సినిమా అక్టోబర్ 5న విడుదల కాబోతోంది.

 

Nagarjuna Bollywood comeback with Brahmastra help to The Ghost
Author
First Published Sep 26, 2022, 2:01 PM IST

ఇద్దరు టాలీవుడ్  సీనియర్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ కి సిద్ధమవుతున్నాయి. అవే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "గాడ్ ఫాదర్" మరియు కింగ్ నాగార్జున నటించిన "ది ఘోస్ట్" సినిమాలు. మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" అనే సినిమాకి రీమేక్ గా "గాడ్ ఫాదర్" సినిమా అక్టోబర్ 5న విడుదల కాబోతోంది. ఈ విషయం తెలిసినప్పటికీ నాగార్జున కూడా తన సినిమా "ది ఘోస్ట్" ని అదే రోజున విడుదల చేయాలని ప్లాన్ చేశారు. 

ఈ ఇద్దరిలో ఎవరైనా ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గకపోవటంతో  ఈ రెండు సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అవ్వబోతున్నాయి. నిజానికి రెండు సినిమాలకి బజ్ కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ఇక గాడ్ ఫాదర్ చిత్రాన్ని హిందీలో ప్రమోట్ చేయటానికి సల్మాన్ సీన్ లోకి తెచ్చారు చిరు. అయితే అదే సమయంలో ది ఘోస్ట్ ని హిందీలో రిలీజ్ కు ప్లాన్ చేస్తూ బ్రహ్మాస్త్ర క్రేజ్ ని వాడుకోవాలనుకుంటున్నారు నాగార్జున. వివరాల్లోకి వెళితే...

ఈ మధ్యనే "బ్రహ్మాస్త" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఆ సినిమాలో ఆయన పాత్ర చిన్నదే అయినా మంచి పేరు వచ్చింది. బాలీవుడ్ లో కూడా మరోసారి నాగ్ ని గుర్తు చేసుకున్నారు.  తాజాగా ఇప్పుడు "ది ఘోస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్గా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే నెల 5 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ వెర్షన్ సైతం రిలీజ్ కు నాగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు నాగ్ స్వయంగా అక్కడ  బయ్యర్లుతో మాట్లాడారని తెలుస్తోంది. ముఖ్యంగా హిందీ ఓటిటి, శాటిలైట్ రైట్స్ అమ్మటంలో నాగ్ సహకారం ఇచ్చారని చెప్తున్నారు. అందుకు బ్రహ్మాస్త్ర క్రేజ్ ఉపయోగపడిందని సమాచారం. అలాగే  నార్త్ లో ధియోటర్ రిలీజ్ కు సైతం ఆయన సహకరిస్తున్నట్లు వినికిడి. అయితే ఇప్పటిదాకా నార్త్ లో ట్రైలర్ కూడా వదలలేదు కాబట్టి థియేటర్ రిలీజ్ ఒకేసారి ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. 

మరో ప్రక్క ఈ సినిమా ఆసక్తికరమైన టైటిల్ వెనుక ఒక చిన్న కథ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నాగార్జున ను సినిమాకి "ది ఘోస్ట్" అనే టైటిల్ ను ఎందుకు పెట్టాలని అనిపించింది అని అడగగా సినిమాకి ఎప్పటినుంచో "ది ఘోస్ట్" అనే టైటిల్ ని పెట్టాలని అనుకుంటున్నట్లుగా నాగార్జున తెలిపారు. కానీ అప్పుడే విడుదలైన కమల్ హాసన్ మరియు లోకేష్ కనగరాజ్ సినిమా పోస్టర్లో "వన్స్ అపాన్ ఏ టైం, దేర్ లీవ్డ్ ఏ ఘోస్ట్" అని రావడంతో తమ సినిమాకు వేరే టైటిల్ను వెతికి "విక్రం గాంధీ" అని పెట్టాలని అనుకున్నారట.

 సినిమాలో నాగార్జున పాత్ర పేరు విక్రమ్ గాంధీ. పైగా నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటైన "విక్రమ్" కు స్పిన్ ఆఫ్ లాగా ఉంటుందని ప్రవీణ్ సత్తారు కూడా ఈ టైటిల్ను ఖరారు చేశారు. కానీ కమల్ హాసన్ తమ సినిమాకి "విక్రమ్" అనే టైటిల్ ను పెట్టేశారు. దీంతో మళ్లీ ముందుగా అనుకున్న "ది ఘోస్ట్" ని తమ సినిమాకి టైటిల్ గా పెట్టామని స్పష్టం చేశారు నాగార్జున.  

Follow Us:
Download App:
  • android
  • ios