Asianet News TeluguAsianet News Telugu

నాగ్ చూసుకోలేదు, దాంతో తిట్టిపోస్తున్నారు, క్షమాపణ చెప్పాడు

ఈ ఘటన నా దృష్టికి వచ్చింది. ఇలాంటిది జరిగి ఉండాల్సింది కాదు. సదరు వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నా. 

Nagarjuna Bodyguard PUSHES Specially Abled Fan jsp
Author
First Published Jun 24, 2024, 6:22 AM IST


నిన్నటి నుంచి ఇంటర్నెట్ లో ఓ డిస్ట్రబింగ్ ఇన్సిడెంట్ కు సంభందించిన వీడియో హల్ చల్ చేస్తోంది. అందులో నాగార్జున ఉండటం తో అది హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున బాడీగార్డ్ ఒకరు స్పెషల్లీ ఎబెల్డ్ అయిన అభిమాని సెల్ఫీ కోసం వస్తే నాగ్ బాడీగార్డ్ అతన్ని ప్రక్కకు తోసేసారు. ఈ ఇన్సిడెంట్ వీడియో మన సౌత్ పెద్దగా లేదు కానీ నార్త్ సైడ్ బాగా వైరల్ అయ్యింది. దాంతో చాలా మంది నాగ్ ని తిట్టిపోయటం మొదలెట్టారు. ఈ విషయం నాగ్ దృష్టికి వెళ్లింది. ఆయన స్పందించారు.

వివరాల్లోకి వెళితే...ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తున్న నాగార్జునను చూసిన ఓ అభిమాని కలిసేందుకు ముందుకు దూసుకువచ్చాడు. అయితే క్షణాల్లో తేరుకున్న సిబ్బంది ఒకరు సదరు వ్యక్తిని పక్కకు లాగేశాడు. ఆ సమయంలో ఈ విషయం నాగార్జున దృష్టికి వచ్చినట్లు వీడియోలో కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశాడు. దీంతో నాగార్జున స్పందించారు. 

‘‘ఈ ఘటన నా దృష్టికి వచ్చింది. ఇలాంటిది జరిగి ఉండాల్సింది కాదు. సదరు వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను’’ అని పోస్టు చేశారు. 
 

అయితే ఇలాంటి సంఘటనలు రొటీన్ గా చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. తమ అభిమాన హీరోలతో ఒక్కసారైనా మాట్లాడాలని, ఫొటో దిగాలని అభిమానులు ఉవ్విళ్లూరుతూండటమే అందుకు కారణం. ఊహించని విధంగా అనుకోని సందర్భాల్లో తారస పడితే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. వారి  ఆనందానికి అవధులుండవు. అదే క్షణంలో వారిని కలిసేందుకు సెక్యూరిటీ ని  సైతం లెక్కచేయకుండా సాహసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు అభిమానుల ఉత్సాహాన్ని చూసి సెలబ్రిటీలే దగ్గరికి వెళ్లి మరీ సెల్ఫీలు దిగుతుంటారు. కొన్నిసార్లు మాత్రం సెక్యూరిటీ సిబ్బంది చేతిలో అభిమానులకు భంగపాటు తప్పదు. ఇలాంటివన్నీ ఎక్కువగా ఎయిర్ పోర్ట్ లు వంటి చోట  జరుగుతుంటాయి.  
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios