చిరు బర్త్ డే సందడి ముగిసింది. దాదాపు వారం రోజులుగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ హడావుడి చేసింది. సోషల్‌ మీడియా మొత్తం మెగాస్టార్‌ హంగామానే సాగింది. ఇక ఇప్పుడు మన్మథుడు రంగంలోకి దిగాడు. ఈనెల 29న నాగార్జున పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే. దీంతో వారం రోజుల ముందే బర్త్ డే హడావుడి స్టార్ట్ చేశారు. 

అందులో భాగంగా ఆదివారం సాయంత్రం నాగార్జున బర్త్ డే సీడీపీని విడుదల చేశారు. కింగ్‌ నాగ్‌ బర్త్ డే సీడీపీ పేరుతో రూపొందించిన ఈ సీడీపీని స్టార్‌ హీరోయిన్‌, నాగార్జున కోడలు సమంత విడుదల చేశారు. ఇక ఈ కామన్‌ డీపీలో కూడా నాగ్‌ కెరీర్‌లోని మైలురాయి లాంటి సినిమాల్లోని నాగ్‌ గెటప్‌లను పొందుపరిచారు.  అందులో `శివ`, `అన్నమయ్య`, `శ్రీరామదాసు`, `హలోబ్రదర్‌`, `రాజన్న`, `మన్మథుడు`, `కింగ్‌`, `భాయ్‌, `మాస్‌, `గీతాంజలి`, `ఊపిరి`, `సోగ్గాడే చిన్ని నాయన`, `దేవ్‌దాస్‌` వంటి చిత్రాల్లోని గెటప్‌లు ఉండటం విశేషం. 

ఇదిలా ఉంటే ఇటీవల బర్త్ డే సీడీపీల హడావుడి సోషల్‌ మీడియాలో బాగా పెరిగింది. కరోనా ప్రభావంతో సోషల్‌ మీడియానే నమ్మకున్నారు. తమ ప్రమోషన్‌కి కేరాఫ్‌గా సోషల్‌ మీడియా నిలుస్తుంది. మహేష్‌ హ్యాపీ బర్త్ డే యాష్‌ ట్యాగ్‌లు, పవన్‌ బర్త్ డే యాష్‌ ట్యాగ్‌లు రికార్డ్ ట్వీట్లతో సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే. మరి నాగ్‌ వీరితో పోటీపడతాడా? అన్నది చూడాలి.  

గత కొంత కాలంగా హిట్లు లేని నాగార్జున హిట్‌ కోసం ఎంతో తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.