తెలుగు టీవీల్లో అత్యంత పాపులర్‌ షో `బిగ్‌బాస్‌`. ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా నాల్గో సీజన్‌ ప్రారంభమైంది. రెండు వారాల క్రితం ప్రారంభమైన ఈ షోపై ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. కానీ `బిగ్‌బాస్‌4` ఫస్ట్ ఎపిసోడ్‌ మాత్రం రికార్డులు సృష్టించింది. 

`బిగ్‌బాస్‌` తెలుగు సీజన్‌ 4 తొలి ఎపిసోడ్‌తో నాగార్జున తన సత్తా చాటారు. ఇప్పటి వరకు తెలుగు `బిగ్‌బాస్‌` చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన షోగా నిలిచింది. `బిగ్‌బాస్‌` చరిత్రలోనే రానటువంటి టీఆర్పీ ఈ షోకి రావడం విశేషం. `బిగ్‌బాస్‌4` తొలి ఎపిసోడ్‌ ఏకంగా 18.5టీఆర్సీ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దీంతో ఈ షో టాప్‌లో నిలిచింది. 

అంతేకాదు తొలి ఎపిసోడ్‌ని ఏకంగా నాలుగున్నర కోట్ల మంది వీక్షించారు. అంటే మన తెలుగునాట ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ షో చూశారని `బిగ్‌బాస్‌4` యూనిట్‌ తెలిపింది. ఈ మేరకు గురువారం నాగార్జున ఓ పోస్టర్‌ని విడుదల చేసి ధన్యవాదాలు తెలిపారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటోంది. దీన్ని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. అయితే మొదటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తారు. ఎవరెవరు వస్తున్నారని, ఆ విషయంలో అందరిలోనూ ఉత్కంఠ ఉంటుంది. దానివల్లే ఈ సారి రికార్డ్ టీఆర్పీ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.