Asianet News TeluguAsianet News Telugu

bigg boss telugu 7: అమర్‌ కోరిక తీర్చిన నాగార్జున.. ఊహించని సర్‌ప్రైజ్‌.. గౌతమ్‌, శివాజీ మధ్య గొడవ..

అమర్‌ దీప్‌కి ఊహించని సర్ప్రైజ్‌ ఇచ్చాడు నాగ్‌. అర్జున్‌ తర్వాత అత్యధిక పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉన్న అమర్‌ దీప్‌ కోరికని నెరవేర్చాడు.

nagarjuna big surprise to amar deep big conflict between shivaji and gautam arj
Author
First Published Dec 2, 2023, 11:02 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 13వ వారానికి సంబంధించి శనివారం ఎపిసోడ్‌.. ఆసక్తికరంగా సాగింది. ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున వచ్చి ఎవరెవరు తప్పులు చేశారో నిలదీశారు. ఇందులో శివాజీ, ప్రియాంక, అమర్ దీప్‌, గౌతమ్‌లకు క్లాస్‌ పీకాడు నాగ్‌. ప్రియాంక ఆడే డబుల్‌ గేమ్ లను, గౌతమ్.. అమర్‌, శోభాకి సపోర్ట్ చేయడంపై ప్రియాంకని నిలదీయకపోవడంపై ప్రశ్నించారు. అలాగే శివాజీ, శోభా శెట్టి సరైన ఆట ఆడలేదని ప్రశ్నించారు. ఇక ఫైనలిస్ట్ అయిన అర్జున్‌ని అభినందించారు. 

ఇందులో అమర్‌ దీప్‌కి ఊహించని సర్ప్రైజ్‌ ఇచ్చాడు నాగ్‌. అర్జున్‌ తర్వాత అత్యధిక పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉన్న అమర్‌ దీప్‌ కోరికని నెరవేర్చాడు. అత్యధిక పాయింట్లు సాధించినందుకుగానూ మంచి ఆటతీరుకి వచ్చే వారం కెప్టెన్‌గా అపాయింట్‌ చేశాడు. దీంతో అమర్‌ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అయితే ఇంతకు ముందులా కెప్టెన్‌కి వచ్చే ఇమ్యూనిటీ అమర్‌ దీప్‌కి దక్కదు. అలాగే శోభ, ప్రియాంకలను అసిస్టెంట్లు గా పెట్టుకోకూడదే కండీషన్‌ పెట్టాడు. దీంతో శివాజీ, అర్జున్‌లను తనకు సహాయకులుగా ఎంచుకున్నాడు అమర్‌ దీప్. అయితే ఆయన ఆట సరిగా ఆడలేదని, పౌల్‌ ఆడాడని ఆ వీడియోలు చూపించి మరీ పరువు తీశాడు నాగ్‌. 

అనంతరం బుక్‌లను అంకితం చేసే టాస్క్ నిర్వహించారు. ఇందులో ఒక్కో బుక్కు ఒక్కో క్వాలిటీతో ఉంటుంది. దాన్ని వారు పాటించడం, తగ్గించుకోవడం చేయాల్సి ఉంటుంది.ఇందులో మొదట శోభా..సొంతంగా ఆడటం ఎలా ? అని తెలియజేసే బుక్‌ని ప్రియాంకకి అంకితం చేసింది. ప్రియాంక.. బ్రెయిన్‌ ఉపయోగించి ఆడటం ఎలా ? అనేది యావర్‌కి ఇచ్చింది. యావర్‌.. నెగటివి వ్యాప్తించకుండా చూడటం ఎలా ? అనే పుస్తకాన్ని శోభాకి ఇచ్చాడు. అమర్‌.. సరైన కారణాలతో నామినేట్‌ చేయడం ఎలా అని ప్రశాంత్‌కి ఇచ్చారు. 

ప్రశాంత్‌.. గయ్యాలి కాకుండా గమ్మున ఉండటం ఎలా అనేది అమర్ దీప్‌కి ఇచ్చాడు. గౌతమ్‌.. ప్రతి దాన్నిరైట్స్ అనుకోకుండా ఉండటం ఎలా ? అనే పుస్తకాన్ని శివాజీకి ఇచ్చాడు. శివాజీ.. కుళ్లు కుతంత్రాలు లేకుండా ఉండటం ఎలా అనేదాన్ని గౌతమ్‌కి ఇచ్చాడు. అర్జున్‌.. ఎక్స్ ట్రాలు ఆపడం ఎలా ? అనే పుస్తకాన్ని అమర్‌ దీప్‌కి ఇచ్చాడు. ఇలారెండు పుస్తకాలు వచ్చాయి. దీంతోపాట్‌ నాగార్జున కూడా నిజాలు చెప్పడం ఎలా అనే పుస్తకాన్ని అమర్‌కి ఇచ్చాడు. 

ఇక ఈ వారం ఎలిమినేషన్‌ విషయానికి వస్తే, ఈ వారంలో అర్జున్‌, శివాజీ, ప్రశాంత్‌, గౌతమ్‌, శోభా శెట్టి, ప్రియాంక, యావర్‌ నామినేషన్‌లో ఉన్నారు. డైరెక్ట్ అర్జున్‌ఫైనల్‌కి వెళ్లడంతో ఆయన నామినేషన్‌ నుంచి సేఫ్‌ అయ్యారు. ఇక ప్రస్తుతం ఆరుగురు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది తెలియాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios