'బంగార్రాజు' తొమ్మిదో రోజుతో పోల్చితే పదో రోజు కలెక్షన్స్ పుంజుకున్నాయి. ఆంధ్ర తెలంగాణ కలిపి ఆదివారం ఈ సినిమా రూ. 81 లక్షలు షేర్ తో రూ. 1.45 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.


 నాగార్జున - నాగ చైతన్య హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ''బంగార్రాజు''. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా సెకండ్ వీక్ లో అడుగుపెట్టింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బ్రేక్ ఈవెన్‌కి బంగార్రాజు ఎంత దూరంలో ఉన్నాడు? అనేది చూద్దాం.

 ఈ సినిమాకు మొదటి నుంచి కలసి వచ్చి అంశం. బాక్సాఫీస్ వద్ద పోటీగా మరో సినిమా లేకపోవడం. దాంతో టాక్ తో సంబంధం లేకుండా ఈ మల్టీస్టారర్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అలాగే 'బంగార్రాజు' తొమ్మిదో రోజుతో పోల్చితే పదో రోజు కలెక్షన్స్ పుంజుకున్నాయి. ఆంధ్ర తెలంగాణ కలిపి ఆదివారం ఈ సినిమా రూ. 81 లక్షలు షేర్ తో రూ. 1.45 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

మొత్తం మీద ఈ పది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 34.01 కోట్లు షేర్ తో రూ. 53.70 కోట్లు గ్రాస్ సాధించింది. దీనికి ఓవర్ సీస్ ₹ 1.67 కోట్లు - రెస్టాఫ్ ఇండియా ₹ 1.43 కోట్లు కలెక్షన్స్ కలిపితే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ₹ 37.11 కోట్ల షేర్ తో ₹ 60.50 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు అవుతుంది.

కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ''బంగార్రాజు'' సినిమా 60 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం గొప్ప విషయమే. ఏపీలో వసూళ్ళు బాగానే ఉన్నా సొంతంగా రిలీజ్ చేసుకున్న నైజాంలో మాత్రం చెప్పుకోదగినట్లుగా లేవు. ఇప్పటివరకు అన్ని ఏరియాల లెక్కలు చూస్తే... 10 రోజుల్లో 97.60% రికవరీ అయినట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్ కి బాలెన్స్ పూర్తయ్యే అవకాశం ఉంది.

కాగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రానికి సీక్వెల్ గా ''బంగార్రాజు'' సినిమా తెరకెక్కింది. ఇందులో నాగార్జున - నాగచైతన్య తాత మనవళ్లుగా కనిపించి సందడి చేశారు. ఇందులో రమ్యకృష్ణ - కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా.. ఫారియా అబ్దుల్లా - దక్షా నగర్కార్ - వేదిక స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.

అక్కినేని తండ్రీకొడుకులు నటించిన సినిమా కావడం.. బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ కావడంతో బజ్ క్రియేట్ అయింది. 'బంగార్రాజు' ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫెస్టివల్ కు ఆడియన్స్ కోరుకునే పర్ఫెక్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకునేలా చేసింది. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండటం కలిసొచ్చింది.