గత వీకెండ్ బిగ్ బాస్ వేదికపై సమంత సందడి చేసినప్పటికీ నాగార్జునను మిస్సయిన భావన అందరికీ కలిగింది. దాదాపు రెండు వారాలకు పైగా సాగె వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ షెడ్యూల్ కోసం కులుమనాలి వెళ్లిన నాగార్జున హుటా హుటిన హైదరాబాద్ చేరుకున్నారు. బిగ్ బాస్ హోస్ట్ గా ఈ వారం కూడా సమంతతో మేనేజ్ చేద్దాం అని నిర్వాహకులు భావించారు. ఐతే సమంత కున్న కమిట్మెంట్స్ మరియు బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఆమె చేయనని చెప్పారట. దీనితో బిగ్ బాస్ నిర్వాహకులకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. 

కులుమనాలి షూటింగ్ లో ఉన్న నాగార్జున యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్ చేరుకున్నారు. కులుమనాలి నుండి హెలికాప్టర్ లో ఎయిర్పోర్ట్ కి చేరుకున్న నాగార్జున, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి అక్కడ నుండి అన్నపూర్ణ స్టూడియో నందు గల బిగ్ బాస్ సెట్ లో దిగిపోయారు.నాగార్జున కోసం బిగ్ బాస్ నిర్వాహకులు బాగానే ఖర్చు చేశారు అనిపించింది. నాగార్జున జర్నీని బిగ్ బాస్ ప్రేక్షకులకు ఆసక్తికరంగా చూపించగా ఆకట్టుకుంది. 

ఎప్పటిలాగే నాగార్జున ఈ వారం తన హోస్టింగ్ స్కిల్స్ తో అదరగొట్టారు. ఇంటి సభ్యులను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఒకరి పట్ల మరొకరి అభిప్రాయాలను ప్రత్యేక వీడియోల ద్వారా చూపించి...వారి నిజ స్వరూపం ఏమిటో తెలియజేశాడు. మోనాల్, ఆరియానా, అఖిల్, అభిజిత్ కన్ఫెషన్ రూమ్ కి రావడం జరిగింది. అనారోగ్యంతో ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయిన నోయల్ కి నాగార్జున గ్రాండ్ సెండ్ ఆఫ్ చెప్పారు.