Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున‌- అఖిల్ కాంబోలో భారీ మల్టీ స్టారర్, ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనౌన్స్ చేసిన కింగ్

కింగ్ నాగార్జున నటించిన ఘోస్ట్ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు నాగార్జునతో పాటు ఆయన ఇద్దరు తనయులు.. టాలీవుడ్ హీరోలు నాగచైతన్య.. అఖిల్ సందడి చేశారు. ఇక ఈ వేదిక నుంచి ఓ ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ చేశారు కింగ్. 

Nagarjuna Akhil Multistarer Movie Announcement at ghoest Pre Release Event
Author
First Published Sep 25, 2022, 10:47 PM IST

కింగ్ నాగార్జున నటించిన ఘోస్ట్ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు నాగార్జునతో పాటు ఆయన ఇద్దరు తనయులు.. టాలీవుడ్ హీరోలు నాగచైతన్య.. అఖిల్ సందడి చేశారు. ఇక ఈ వేదిక నుంచి ఓ ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ చేశారు కింగ్. 

నాగార్జున .. సోనాల్ చౌహాన్ జంటగా.. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ది ఘోస్ట్, ఈ మూవీ వచ్చే నెల 5న దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ సంద్భంగా.. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల్, నాగచైతన్యతో కలిసి నాగార్జున వచ్చి సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్ లో ముగ్గరు హీరోలు మాట్లాడి అభిమానులను ఉర్రూతలూగించారు. 

కింగ్ నాగార్జున మాట్లూడుతూ.. ఘోస్ట్ మూవీల్ మీరు అనుకున్నట్టే కనిపిస్తాను అన్నారు.  30 ఏళ్ల క్రితం శివ సినిమాలో చైన్ పట్టుకుని ఇదే అక్టోబర్ 5న వచ్చాను.. ఈసారి కత్తి పట్టుకుని వస్తున్నాను. అప్పుడు ఆదరించారు.. ఇప్పుడు కూడా ఆదరించమని కోరుకుంటున్నాను అన్నారు నాగార్జున.  చాలా కాలం తరువాత ఫుల్ మీల్స్ లాంటి యాక్షన్ సినిమా చేశాన్నారు నాగ్. అంతే కాదు మీలో ఉత్సాహం చూడటానికే.. అఖిల్, చైతూని ఈఈవెంట్ కు తీసుకువచ్చాను అన్నారు. ఇక ఈ ఇయర్ లో చైతూతో బంగార్రాజులో నటిచాను. ఇక నెక్ట్స్ అఖిల్ తో నటించబోతున్నాను అంటూ అననౌన్స్ చేశారు నాగార్జున. అఖిల్ తో సినిమా ఎలా ఉంటుంది అంటే... ఘోస్ట్.. ఏజంట్ సినిమాలు కలిస్తే ఎలా ఉంటుందో.. ఆసినిమా కూడా అలానే ఉంటుందిత అంటూ నాగార్జున మల్టీ స్టారర్ ను అనౌన్స్ చేశారు. త్వరలో ఆసినిమా స్టార్ట్ కాబోతుందంటూ.. చెప్పారు కింగ్. 

అంతే కాదు అన్నమయ్యటైమ్ లో కర్నూల్ వచ్చాను.. తరువాతర రావడం ఇదే.. ఇక్కడ పొలాల్లో డ్యూట్లు పాడాను.. ఎంతో టైమ్ ఇక్క డ స్పెండ్ చేశాము.. మళ్లీ ఇప్పుడు ఘోస్ట్  మూవీ కోసం వచ్చాను. ఈ సినిమాను ఆదరిస్తారని కోరకుంటున్నాను అంటూ నాగర్జున మాట్లాడారు. అంతే కాదు అక్టోబర్ 5న తన సినిమాతో పాటు తనకు ఎంతో ఇష్టమైన ఫ్రెండ్ చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ అవుతుంది.. విజయదశమి సందర్భంగా ఈ రెండు సినిమాలకు విజయం కలగాలని కోరకుంటున్నాను అన్నారు నాగార్జున. 

ఇక నాగచైతన్య మాట్లాడుతూ.. నేనువారంలో ఓ రెండు మూడు సార్లు నాన్నతో కలిసి భోజనం చేస్తాను. అప్పుడు ఓ 10 నిమిషాలు ఆయన సినిమాలు గురించి మాట్లాడుతాడు. బిగ్ బాస్ గురించి ఇతర సినిమాల టాపిక్ ఉంటుంది. కాని ఈమధ్య ఆయన ఘోస్ట్ సినిమా గుంరించి తప్ప దేని గురించి మాట్లాడటంలేదు. అంత హార్డ్ వర్క్ చేశారు ఆ సినిమా కోసం.. ఆయన ఎనర్జీ.. ఆయన కష్టపడే తీరు మాకు ఆదర్శం అన్నారు నాగచైతన్య.

ఇక అఖిల్ మాట్లాడుతూ నాన్నను ఎలా చూడాలి అనుకుంటున్నానో అలా ఈ సినిమాలో చూపించాడు ప్రవీణ్ సత్తారు అన్నాడు. అంతే కాదు ముప్పై ఏళ్ల ముందు ఎంత ఎనర్జీతో ఉన్నారో అంతే ఎనర్జీతో ఈసినిమాలో చేశారు. ఇంకా ఆయన ఆకలి తీరడం లేదు సినిమా అంటే అంత కసి నాన్నకు అంటూ... నాగ్ ను ఆకాశానికి ఎత్తాడు అఖిల్. మాకు ఆదర్శం ఎక్కడో లేదు మా ఇంట్లోనే ఉంది. ఆయన హార్డ్ వర్క్ మాకు ఆదర్శం అన్నారు అఖిల్. అక్టోబర్ 5న అందరూ సినిమా చూడాలని.. తమ  కుటుంబాన్ని ఆదరించాలని కోరుకున్నారరు ముగ్గరు హీరోలు. 

Follow Us:
Download App:
  • android
  • ios