అన్న‌మ‌య్య శ్రీరామ‌దాసు శిరిడి సాయి భ‌క్తిర‌స సినిమాల్లో న‌టించిన నాగార్జున‌ తాజాగా ఓం న‌మో వేంక‌టేశాయ భ‌క్తి మూవీలో న‌టించిన నాగర్జున‌ త‌రువాత మ‌రో భ‌క్తిర‌స మూవీలో న‌టించ‌బొతున్న అక్కినేని నాగార్జున‌

ఇదిలా ఉంటే....ఓం న‌మో వేంక‌టేశాయ ఆడియో వేడుక‌లో నాగార్జున మాట్లాడుతూ...ర‌చ‌యిత జె.కె.భార‌వి మ‌రో క‌థ రెడీ చేస్తున్నారు. కాక‌పోతే అది భ‌క్తిర‌స చిత్రం కాదు అని చెప్పారు. అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...ఇస్కాన్ (అంత‌ర్జాతీయ కృష్ణ చైత‌న్య సంఘం) ఫౌండ‌ర్ అయిన స్వామి ప్ర‌భుపాద జీవితం ఆధారంగా భార‌వి క‌థ రెడీ చేస్తున్నార‌ట‌. శ్రీకృష్ణుడి భ‌క్తుడి జీవిత క‌థ కాబ‌ట్టి ఈ చిత్రాన్ని ఇస్కాన్ పౌండేష‌న్ నిర్మించ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపిస్తుంద‌ట‌.మ‌రి... నాగ్ ఈ మూవీ చేస్తే మ‌రో సంచ‌ల‌న‌మే..