నటి జీవితా రాజశేఖర్‌కి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. చిత్తూరి జిల్లా నగరి కోర్ట్ జీవితకి శుక్రవారం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 

రాజశేఖర్‌ సతీమణి, నటి జీవితా రాజశేఖర్‌(Jeevitha Rajashekar)పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. నగరి కోర్టు శుక్రవారం ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జ్యో స్టార్‌ ఎండీ హేమ.. జీవితపై చెక్‌ బౌన్స్ కేసులో నగరి కోర్ట్ ని ఆశ్రయించారు. రూ. 26కోట్లు ఎగ్గొట్టారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారనే ఆరోపణలు జీవితా రాజశేఖర్‌పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో హేమ కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేయగా, నగర కోర్ట్ జీవితకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 

 తనకు జీవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్ ఆయ్యానని జ్యోస్టార్‌ ఎండీ హేమ ఆరోపిస్తున్నారు. తమకు రావలసిన రూ. 26 కోట్లు రూపాయలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు వెల్లడించారు. `గరుడ వేగ` సినిమాకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల్లో రాజశేఖర్ దంపతులు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపించారు. 2017లో రాజశేఖర్ హీరోగా గరుడవేగ (Garudavega) చిత్రం విడుదలైంది. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. 

ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ ఉంది. ఈ సినిమా నిర్మాణం కోసం జ్యో స్టార్ సంస్థ యజమాలు తమ ఆస్తులు అమ్మి డబ్బులు సమకూర్చారట. చివరకు తమకు రావలసిన డబ్బులు జీవితా రాజశేఖర్ చెల్లించలేదనేది వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తమ ఆస్తులు బినామీ పేర్లకు మళ్లించి రాజశేఖర్, జీవితా దంపతులు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని తెలుస్తుంది. అయితే కొన్నాళ్లుగా జీవిత రాజశేఖర్ పై చెక్ బౌన్స్ కేసు నడుస్తుంది. ఈ కేసులో రాజశేఖర్ (Rajashekar) జైలు వెళ్లడం ఖాయమని జ్యో స్టార్ సంస్థ మీడియాకు తెలియజేశారు. 

గురుడవేగ చిత్రాన్ని జీవితా రాజశేఖర్ కుటుంబం స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాలు లాభాలు గడించినట్లు సమాచారం ఉంది. మరి సినిమా నిర్మాణానికి నిధులు సమకూర్చిన జ్యో స్టార్ సంస్థకు (Jyo star enterprises) చెల్లించాల్సిన మొత్తం జీవితా రాజశేఖర్ దంపతులు చెల్లించలేదట. చిత్తూరు జిల్లా నగరిలో వీరిపై కేసు నమోదైంది. జ్యోస్టార్‌ ఎండీ హేమ వేసిన పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన కోర్ట్ తాజాగా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్టు సమాచారం. అయితే దీనిపై జీవిత రాజశేఖర్‌ రేపు(శనివారం) మీడియా ముందుకు రాబోతున్నారు.