వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు నటుడు దునియా విజయ్. గత కొద్దిరోజులుగా ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇద్దరు భార్యల గొడవలు, అలానే జిమ్ ట్రైనర్ మారుతిపై దాడి వంటి కేసులతో విజయ్ సతమతమవుతూనే ఉన్నాడు.

దునియా విజయ్ మొదటి భార్య నాగరత్న తన భర్త.. కీర్తి గౌడని రెండో వివాహం చేసుకోవడం సహించలేకపోయింది. ఈ విషయంలో వీరిద్దరికీ తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల నాగరత్న కూతురిపై కీర్తి గౌడ అనుచరులు దాడి చేయడం మరో కేసుకి కారణమైంది.

ఇప్పుడు నాగరత్న తన భర్తపై మహిళా కమీషన్ కి ఫిర్యాదు చేసింది. మొదటి భార్య బతికుండగానే తన భర్త రెండో పెళ్లి చేసుకున్నారని ఈ విషయంలో భరణంతో పాటు నివాసాన్ని కల్పించాలని నాగరత్న మహిళా కమీషన్ కి కేసు దాఖలు చేశారు. ఐపీసీ 494 సెక్షన్ కింద నాగరత్న ఫిర్యాదు చేశారు. ఆరోపణలు నిజాలని తేలితే.. విజయ్ కి ఏడేళ్ల జైలు శిక్ష తప్పదు.