ఏఎన్ఆర్ గెటప్ లో.. చైతూ లుక్ ఇదే

First Published 9, May 2018, 12:52 PM IST
nagachaitanaya as ANR in mahanati photos viral
Highlights

వైరల్ గా మారిన ఫోటోలు

అందం, అభినయం కలబోసిన అలనాటి అందాల తార సావత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ మహానటి’. కీర్తిసురేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసినవారంతా అద్భుతంగా ఉందంటూ  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

అయితే ఈ సినిమాలో సావిత్రితో నటించిన, సినిమాలు తీసిన ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలను ఈతరం నటులతో, దర్శకులతో పాత్రలు వేయించి వారిని గుర్తుచేసేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రయత్నించాడు. ఇప్పటివారు అప్పటివారిలా ఎలా ఉన్నారనే ప్రేక్షకుల ఉత్సుకతకు తెరదించుతూ కొందరి ఫొటోలను చిత్ర యూనిట్ ఇప్పటికే విడుదల చేసింది. 

అయితే ఏఎన్నార్ పాత్రలో నటించిన నాగచైతన్య గెటప్‌ను మాత్రం రివీల్ చేయలేదు. కానీ, సినిమా చూసిన కొందరు నాగచైతన్య ఏఎన్నార్‌గా ఎలా మెప్పించాడో ఫొటోలు తీసి నెట్‌లో లీక్ చేశారు. ఇప్పుడీ ఫొటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్యం అచ్చుగుద్దినట్లు ఉన్నాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

అంతేకాదు.. ఏఎన్ఆర్ బయోపిక్ చైతూతో తీయండి అంటూ కొందరు నాగార్జునకు సలహాలు కూడా ఇచ్చారు. ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలి నిజంగా చైతూ వాళ్ల తాతను తలపించేలా కనపడుతున్నాడు ఈ ఫోటోలో.

loader