పవన్‌ పుట్టినప్పుడు వారి ఒక్కరి ఇంట్లోనే సంతోషం ఉందని, ఇప్పుడు లక్షల ఇండ్లకు ఆ సంతోషం వ్యాపించిందని అంటున్నారు నాగబాబు. బుధవారం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే అన్ని విషయం తెలిసిందే. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని నాగబాబు కాస్త లేట్‌గా ట్విట్టర్‌ ద్వారా పవన్‌కి పుట్టిన రోజు విశెష్‌ తెలిపారు. 

ఆయన స్పందిస్తూ, `నువ్వు పుట్టిన రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు మా ఇంటిని సంతోషంతో నింపేశావు. ఇప్పుడు నీ పుట్టిన రోజునాడు ఆ సంతోషాన్ని లక్షల కుటుంబాలకు వ్యాపించింది. హ్యాపీ బర్త్ డే తమ్ముడు` అని నాగబాబు ట్వీట్‌ చేశాడు. `తమ్ముడు` అనేది తెలుగులో మెన్షన్‌ చేయడం విశేషం. పవన్‌ `తమ్ముడు` సినిమా చేసిన విషయం తెలిసిందే. 

పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించి ఎలాంటి వివాదమైన, సమస్య ఉన్నా మొదట మెగాబ్రదర్‌ నాగబాబు స్పందిస్తారు. పవన్‌ స్థాపించిన `జనసేన` పార్టీలోనూ నాగబాబు క్రియాశీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కూడా. అంతేకాదు పవన్‌ నటించిన చాలా సినిమాల్లో నాగబాబు కీలక పాత్రలు పోషించారు.