జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న తన 48వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఆయన అభిమానుల సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఇదిలా ఉండగా శివరామ రాజు, సింహరాశి ఫేమ్ దర్శకుడు వి సముద్ర పవన్ కళ్యాణ్ ఆశయాల నేపథ్యంలో 'జై సేన' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంలో సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని జైసేన చిత్ర యూనిట్ తొలి సాంగ్ ని లాంచ్ చేసింది. మెగా బ్రదర్ నాగబాబు ఈ పాటని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా జైసేన చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. 

చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. తన ప్రతి చిత్రంలో సామజిక అంశాలు ఉంటాయని అన్నారు. ఈ చిత్రంలో కూడా పవన్ కళ్యాణ్ భావాలని, ఆయన అభిమానులు చేసే మంచి కార్యక్రమాల్ని చూపించినట్లు దర్శకుడు తెలిపారు. జైసేన జైసేన అంటూ సాగే ఈ పాటలోని విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.