సినీ నటుడు నాగబాబు గత కొంతకాలంగా సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని మన రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం, వైసీపీ పార్టీ నేతలను టార్గెట్ చేసిన నాగబాబు టీడీపీ పార్టీకి చిడతలు వాయిస్తున్నారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై విమర్శలు గుప్పించాడు.

కాంట్రవర్సీలు అవుతాయనుకునే ఇష్యూల గురించి పరోక్షంగా మాట్లాడే నాగబాబు ఈ ఛానెల్ పై మాత్రం నేరుగానే కామెంట్లు చేశాడు. నాగబాబు తీరు చూస్తుంటే ఎటువంటి  పర్యవసానాల గురించి ఆలోచించకుండా ఎటాక్ చేస్తున్నారని అనిపించక మానదు. అయితే ఇప్పుడు ఈయన కారణంగా అతడి కొడుకపై ఎఫెక్ట్ పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

నాగబాబు వీడియోలు పోస్ట్ చేయడం వలన వ్యక్తిగతంగా నష్టపోనప్పటికీ వరుణ్ తేజ్ కి మాత్రం నష్టాలు కలిగేలా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాడు 
వరుణ్ తేజ్. మీడియాలో కూడా అందరి సపోర్ట్ కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు నాగబాబు మీడియా జోలికి పోవడంతో వరుణ్ తేజ్ ని టార్గెట్ చేస్తున్నారు.

అతడు ఎప్పుడు నెగెటివ్ కామెంట్స్ చేస్తారా..? బ్యాడ్ లైట్ లో చూపించాలని సదరు మీడియా వర్గం కూడా రెడీగా ఉంది. ఇదే విషయం అభిమానులను ఆందోళనకి గురి చేస్తోంది. ఈ క్రమంలో కామెంట్స్ చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందంటూ అభిమానులు నాగబాబుపై విరుచుకుపడుతున్నారు.