బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట చిత్రంతో రచ్చ చేస్తున్నాడు. కామెడీ ప్రియులని ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు సంపూర్ణేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొబ్బరి మట్ట చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీని ఇష్టపడే వారి నుంచి ఈ చిత్రాన్ని మంచి రెస్పాన్స్ వస్తోంది. 

మెగా బ్రదర్ నాగబాబు కొబ్బరి మట్ట విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించారు. సంపూర్ణేష్ బాబుకు, చిత్ర నిర్మాత స్టీవెన్ శంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. నాగబాబు మాట్లాడుతూ.. తాను కొబ్బరిమట్ట ట్రైలర్ చూశానని అన్నారు. ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది. చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

ఈ చిత్రానికి తాను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి కారణం ఉందని నాగబాబు అన్నారు. సంపూర్ణేష్ బాబు, స్టీవెన్ శంకర్ ఇద్దరూ మెగా అభిమానులు. వారిని ప్రోత్సహించాల్సిన భాద్యత తనపై ఉందని నాగబాబు అన్నారు. కొబ్బరిమట్ట చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని నాగబాబు అన్నారు.