తాజాగా పవన్ రాజమండ్రిలో జరిగిన 'జనసేన' ఆవిర్భావ మహోత్సవానికి సంబంధించి ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశానికి హాజరయ్యి ఆయన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సమావేశం కోసం నాగబాబు కూడా రాజమండ్రి వెళ్లారు.

మీటింగ్ పూర్తయిన తరువాత నాగబాబు మీడియాతో మాట్లాడారు. జనం మధ్య పవన్ ఎలా ఉపన్యాసం ఇస్తాడో చూడాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని, తమ్ముడు ఉద్వేగంతో మాట్లాడుతున్నప్పుడు జనాల స్పందన చూసి తాను కూడా ఎమోషనల్ అయినట్లు నాగబాబు చెప్పారు.

పవన్ పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు పవన్ లాంటి నిజాయితీ పరుడైన వ్యక్తికి రాజకీయాలు ఎందుకని అనుకున్నానని, కానీ ఈరోజు పవన్ ని చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు. పవన్ లాంటి వ్యక్తులు సమాజంలో వంద ఏళ్లకు ఒకసారే పుడతారంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.