మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కూడా పెద్దగా హడావుడి కనిపించడం లేదు. పెద్ద హీరోలెవరు కూడా కమిటీ దగ్గరకు కూడా వెళ్లడం లేదు. ఇక చాలా రోజుల తరువాత నాగబాబు గారు ఈ ఎన్నికలపై స్పందించారు. అదే విధంగా ఆయన మద్దతు ఎవరికీ ఇస్తున్నారు అనే విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. 

మా ఎలక్షన్స్ లో ఎవరైనా సరే ప్రతిసారి అధ్యక్షుడిగా కొనసాగడం కరెక్ట్ కాదు. నా మద్దతును నరేష్, జీవితా రాజశేఖర్ లకు ఇస్తున్నాను. శివాజీ రాజా విషయంలో నేను ఒక విషయంలో చాలా డిజప్పాయింట్ అయ్యాను. గతంలో అసోసియిలేషన్ గురించ ఎవరుపడితే వాడు నోటికొచ్చినట్లు మాట్లాడారు. మీడియా కూడా వ్యతిరేఖం అయినప్పుడు కేవలం జీవితా రాజశేఖర్, నరేష్ గారు గారు మాత్రమే 'మా' కు మద్దతు పలుకుతూ ధైర్యంగా మాట్లాడారు. 

అందుకే నా మద్దతును వారికి ఇస్తున్నాను అంటూ ఎక్కువకాలం ఎవరు కూడా ప్యానెల్ అధ్యక్షుడిగా ఉడడం కరెక్ట్ కాదని నాగబాబు వివరణ ఇచ్చారు. అలాగే గతంలో తాను కూడా ఒకేసారి అధ్యక్షుడిగా ఉన్నానని చెబుతూ మళ్ళీ బాధ్యతలు తీసుకోమన్నా తాను ఒప్పుకోలేదని తెలియజేశారు.