మెగాబ్రదర్ నాగబాబు ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నానుతూనే ఉన్నారు. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ పట్టి రాజకీయంగా.. సినిమాల పరంగా కొన్ని విషయాలను చర్చిస్తున్న నాగబాబు పలు వెబ్ ఛానెల్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు.

ఇటీవల ఓ వెబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో రామ్ గోపాల్ వర్మ పేరు కూడా పలకడానికి ఇష్టపడని నాగబాబు తాజాగా వర్మపై పాజిటివ్ గా స్పందించారు.

రామ్ గోపాల్ వర్మ అంటే తనకు ఎప్పుడూ ఇష్టం కానీ, గౌరవం కానీ లేవని కానీ దర్శకుడిగా మాత్రం అతడిని అభిమానిస్తానని చెప్పారు. ఎన్ని ఫ్లాప్ లు ఇచ్చినా ఆయనలో ఓ గొప్ప దర్శకుడు ఉన్నాడని నేను నమ్ముతానని నాగబాబు అన్నారు. 

ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ద్వారా ఆయన నిజాలను వెల్లడించబోతున్నారని భావిస్తున్నానని, నిజాలను నిర్భయంగా తెరకెక్కిస్తే ఆ సినిమా కచ్చితంగా ప్రజలను  ఆకట్టుకుంటుందని అన్నారు.