Asianet News TeluguAsianet News Telugu

ఓడినా, గెలిచినా 'జబర్దస్త్' వీడను: నాగబాబు

గత ఆరేడేళ్లుగా బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు నాగబాబు. 

nagababu comments on jabardasth show
Author
Hyderabad, First Published Apr 15, 2019, 11:01 AM IST

గత ఆరేడేళ్లుగా బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు నాగబాబు. ఈ షోకి ఆయన స్పెషల్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి. ఈయనతో పాటు నటి రోజా కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఏపీలో ఎన్నికల నేపధ్యంలో వీరిద్దరూ షోకి దూరమయ్యారు. 

నాగబాబు 'జనసేన' పార్టీలో చేరడం, నర్సాపురం నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయడంతో ఆయన జబర్దస్త్ షోని కంటిన్యూ చేయలేకపోయారు. దీంతో వారి స్థానాల్లో నటి మీనా, శేఖర్ మాస్టర్ లను తీసుకొచ్చారు.

ఇక జడ్జిలుగా వీరే వ్యవహరిస్తారని నాగబాబు, రోజాలు తిరిగొచ్చే ఛాన్స్ లేదని వార్తలు వినిపించాయి. తాజాగా వీటిపై స్పందించిన నాగబాబు 'జబర్దస్త్' షో వదిలేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా 'జబర్దస్త్' మాత్రం కంటిన్యూ అవుతుందని అన్నారు.

నెలకి నాలుగైదు రోజు షో కోసం సమయం కేటాయిస్తే సరిపోతుందని, దాని కారణంగా తన రాజకీయ జీవితానికి ఎలాంటి అడ్డంకి ఉండదని అన్నారు. పైగా ప్రజలను నవ్వించడంలో తను కూడా భాగం అవుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. దీని బట్టి చూస్తుంటే.. నాగబాబు మరికొద్ది  రోజుల్లోనే 'జబర్దస్త్' షోలో మరోసారి దర్శనమిస్తారని తెలుస్తోంది. మరి నటి రోజా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!
 

Follow Us:
Download App:
  • android
  • ios