తెలంగాణా ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తుందని, లేకపోతే తాను గొంతుకోసుకుంటానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ గురించి తెలిసిందే. ఈ విషయంపై మెగాబ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ''బండ్ల గణేష్ మిగతా విషయాల్లో ఎలా ఉన్నా..అతడి ఇంటర్వ్యూలు మాత్రం చూడాలనిపించే విధంగా ఉంటాయి. మంచి కామెడీగా ఉంటాయి.

బండ్ల గణేష్ ఇంటర్వ్యూలలో చేసే కామెడీ గనుక సినిమాల్లో చేసి ఉంటే పెద్ద కమెడియన్ అయి ఉండేవాడు. కానీ సినిమాల్లో చూపించకుండా రియల్ లైఫ్ లో చూపిస్తున్నారు. బండ్ల గణేష్ కి పీక కోసుకునేంత సీన్ లేదని నాకు ముందే తెలుసు.. 'ఎన్నిక ముందు వంద అంటామండి' అని అంటారనే విషయం కూడా తెలుసు.

ఏదేమైనా రేవంత్ రెడ్డి ఆవేశపూరిత ప్రసంగాలు, టీఆర్ఎస్ నేతల ప్రసంగాలు టీవీలో చూసి ఆవేశంలో ఉన్న మాకు బండ్ల గణేష్ వీడియోలు మంచి కామెడీని పంచాయి. ఈ విషయం మాత్రం అతడిని మెచ్చుకోవాల్సిందే'' అంటూ చెప్పుకొచ్చాడు. 

మొన్నటికి మొన్న బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ వార్తల్లో నిలిచిన నాగబాబు ఇప్పుడు బండ్ల గణేష్ రాజకీయ ప్రసంగాలు కామెడీ అంటూ మరోసారి వార్తల్లో నిలిచాడు.  

కావాలనే నన్ను టార్గెట్ చేశారు..బండ్ల గణేష్ కామెంట్స్!

బ్లేడ్ తో గొంతు కోసుకోవడంపై స్పందించిన బండ్ల గణేశ్