బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా ఈ మధ్య బయోపిక్ చిత్రాలు చాలానే పుట్టుకొస్తున్నాయి. మహానటి సినిమా ద్వారా మొదటి అడుగు బలంగా పడటంతో కంటిన్యూ గ ఒక్కోక్కటి తెరపైకి వస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే ఇటీవల మెగాస్టార్ బయోపిక్ గురించి కొన్ని రూమర్స్ తెగ హల్ చల్ చేశాయి. 

తనయుడు చరణ్ తండ్రి పాత్రలో నటిస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఇప్పటికే ఒక సారి అన్సార్ ఇచ్చిన నాగబాబు ఈ విషయంపై మరోసారి తన క్లారిటీ ఇచ్చారు. అసలు మెగాస్టార్ బయోపిక్ లో జనాలను ఆకట్టుకునే మ్యాటర్ పెద్దగా లేదని చెప్పారు.. 

బయోపిక్ అంటే చాలా డ్రామా ఉండాలి అలాగే అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉండాలి. అన్నయ్య బయోపిక్ అంతగా వర్కౌట్ అవ్వధని, ఆయన జీవితంలో జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే విషయాలు కూడా ఏమి లేవని అన్నారు. అదే విధంగా సిల్క్ స్మిత, మహానటి సావిత్రి కథలంత ఇంట్రెస్టింగ్ గా కూడా ఏమి ఉండదని చెబుతూ ఆ ఆలోచన బావుండదని చరణ్ కి కూడా మెగాస్టార్ బయోపిక్ గురించి ఆలోచన ఉడకపోవచ్చని అన్నారు.