Asianet News TeluguAsianet News Telugu

నాగవంశీ కి ‘దేవర’డీల్ సెట్ కాలేదా?ఎంతకు అడిగారు

రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను 130 కోట్ల మేరకు కోట్ చేస్తున్నారట దేవర నిర్మాతలు. తెలుగులో పెద్ద బయ్యర్లు అయిన ఆసియన్ సినిమాస్,...

Naga Vamsi slams reports of him buying Devara rights jsp
Author
First Published Apr 18, 2024, 9:40 AM IST


‘‘సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్న అప్‌డేట్స్‌, ఫొటోల్లో ఎలాంటి వాస్తవం లేదు. మేం నిర్మించే, డిస్ట్రిబ్యూట్‌ చేసే చిత్రాలకు సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటిస్తాం. కాబట్టి, దయచేసి రూమర్స్ నమ్మకండి’’ అంటూ నాగవంశీ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.  ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. నాగవంశీ ఈ పోస్ట్‌ పెట్టానికి కారణం ఏమిటా? అని చాలా మంది  నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం ‘దేవర’ గురించే అని అనుకొంటున్నారు. తమ బ్యానర్‌కు సంబంధించి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత నాగవంశీ (Naga Vamsi) స్పష్టతనిచ్చారని మీడియా అంటోంది. 

గత కొద్ది రోజులుగా  దేవర రైట్స్ మీద వస్తోన్న రూమర్ల మీదే ఇలా స్పందించి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. దేవర మీద సితార కన్నేసిందా? చేతికి చిక్కించుకుందామనుకుందా? లాస్ట్ మినిట్ లో డీల్ సెట్ కాలేదా? అన్న విషయాలు ఇప్పుడు డిస్కషన్ గా మారాయి.    

రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను 130 కోట్ల మేరకు కోట్ చేస్తున్నారట దేవర నిర్మాతలు. తెలుగులో పెద్ద బయ్యర్లు అయిన ఆసియన్ సినిమాస్, దిల్ రాజు ఈ రేట్ కు అంతగా మొగ్గు చూపలేదని తెలుస్తోంది. దిల్ రాజు కోట్ చేసిన రేటుకు దేవర మేకర్లు ఓకె చెప్పలేదంటున్నారు. ఇలాంటి టైమ్ లో నాగవంశీ సీన్ లోకి వచ్చారని... రేటు ఫైనల్ చేస్తే డీల్ ఓకే కావచ్చు అంటున్నారు. ఆ కోట్ చేసే మొత్తం 115 కోట్ల మేరకు వుంటుందని తెలుస్తోంది.కేవలం బ్యానర్ ప్రెస్టీజ్ కోసం నాగవంశీ ఈ డీల్ పై ఇంట్రస్ట్ చూపెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. 

‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’ (Devara). జాన్వీకపూర్‌ కథానాయిక. పవర్‌ఫుల్ యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అక్టోబర్‌ 10న ఇది విడుదల కానుంది. ఎనిమిదేళ్ల తర్వాత హిట్‌ కాంబో రిపీట్‌ కావడం.. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ మెటీరియల్ సినిమాపై అంచనాలను పెంచాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios