ఛలో సినిమాతో గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాలను అందుకున్న యువ హీరో నాగ శౌర్య ఆ తరువాత కాస్త తడబడ్డాడు. అమ్మమ్మగారి ఇల్లు - నర్తనశాల అంటూ ఎదో కొత్త ప్రయోగాలు చేసి అపజయాలను ఎదుర్కొన్నాడు. ఫైనల్ గా ఓ బేబీ సినిమాతో సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ సక్సెస్ అంతా సమంత ఖాతాలో చేరిపోయింది. 

ఇక ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో లేడి డైరక్టర్ లక్ష్మి సౌజన్య  తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. జెర్సీ - రణరంగం వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మణ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఆ సినిమాను నిర్మించనుంది. అయితే ఆ సినిమాకు ఓల్డ్ క్లాసిక్ సినిమా టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

క్యూటీ లవ్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్నమూవీ కావడంతో మూగ మనసులు 2020 అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. నిర్మాత సూర్యదేవర నాగవంశీ త్వరలోనే టైటిల్ పై క్లారిటీ ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకురాలు సౌజన్య ఇంతకుముందు కృష్ణవంశీ శేఖర్ కమ్ముల సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.