హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఈ సారి కృష్ణ వ్రింద విహరి సినిమాతో రాబోతున్నాడు. ఈ సారైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.
హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఈ సారి కృష్ణ వ్రింద విహరి సినిమాతో రాబోతున్నాడు. ఈ సారైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.
వరుస ఫెయిల్యూర్స్ నాగశౌర్యకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. లవర్ బాయ్ గా యూత్ లో మంచి క్రేజ్ ఉంది నాగశౌర్యకి. ఈ మధ్య కాలంలో వరుసగా వరుడు కావలెను, లక్ష్య లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయితే ఈ మధ్య రోటీన్ ఫార్ములాను వదిలి డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు నాగశౌర్య. ఎన్ని ప్రయత్నాలు చేసినా శౌర్యకు సక్సెస్ మాత్రం రాలేదు.
అయితే వరుడు కావలెను సినిమా మినహా ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు నాగశౌర్య. అవి కూడా వర్కౌట్ అవ్వకపోవడంతో మళ్ళీ లవ్ స్టోరీస్ వైపు మళ్ళాడు. మళ్లీ లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపించాయి.ఈ నేపథ్యంలోనే ఆయన కృష్ణ వ్రింద విహారి సినిమా చేశాడు. తన సొంత బ్యానర్ ఐరా' క్రియేషన్స్ పై ఆయన ఈ సినిమాను నిర్మించాడు. అనీష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ సినిమా నుంచి సమంత చేతుల మీదుగా ఒక సాంగ్ ను రిలీజ్ చేయించారు.
రా వెన్నెల్లో వర్షంలా..రా .. వర్షంలో వెన్నెల్లా ..అంటూ సాగే రోమాంటిక్ సాంగ్ కు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా..సంజన, ఆదిత్య కలిసి ఈ పాటను మధురంగా ఆలపించారు. మత్తుగా..రొమాంటిక్ గా అనిపించేలా ఈ పాటను ట్యూన్ చేశారు. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
