అక్కినేని నాగ చైతన్య మొత్తానికి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. వరుస ప్లాపులతో ఉన్న చైతు మజిలీ సినిమా ద్వారా 50 కోట్ల బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని తానేంటో నిరూపించుకున్నాడు. అయితే నెక్స్ట్ ప్రాజెక్టులను కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఇదే ఫ్లోలో వెళ్లాలని ఈ అక్కినేని హీరో ప్రయత్నాలు చేస్తున్నాడు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. RX100 దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల చైతూని కలిసి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అజయ్ కథను చెప్పిన విధానం చైతూకు బాగా నచ్చేసిందట. సమంత కూడా స్క్రిప్ట్ ను విని ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే చాలా మందికి ఇదే కథను చెప్పిన అజయ్ అనుకున్నంతగా మెప్పించకపోవడంతో అక్కినేని కాంపౌండ్ కి షిఫ్ట్ అయ్యాడు. 

ఎలాంటి అనుమానాలు లేకుండా చైతు ఫైనల్ గా యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాను ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చైతు వెంకీ మామ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఆ సినిమా అనంతరం అజయ్ భూపతి సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.