అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటి గుర్తిండిపోయే చిత్రం `మనం`. టాలీవుడ్‌లోనూ ఇదొక క్లాసిక్‌ చిత్రం. తిరుగులేని విజయాన్ని అందించిన చిత్రమిది. విక్రమ్‌ కె. కుమార్‌ మ్యాజిక్‌, ఏఎన్నార్‌, నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రియాల నటన సినిమాకి ప్లస్‌ అయ్యాయి. 

విక్రమ్‌ కుమార్‌.. అఖిల్‌తో `హలో` సినిమా చేసిన మెప్పించలేకపోయారు. కానీ ఈ సారి నాగ్‌కి మంచి గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. చైతూ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా నాగార్జున పుట్టిన రోజుని పురస్కరించుకుని శనివారం ఈ సినిమాని ప్రకటించారు. దీనికి `థ్యాంక్యూ` అనే టైటిల్‌ని నిర్ణయించారు. 

అంతేకాదు చైతూ, విక్రమ్‌ కలిసి నాగ్‌కి గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. `హలో`తో అసంతృప్తిగా ఉన్న నాగ్‌ని ఖుషీ చేయాలని డిసైడ్‌ అయ్యారు. తాజా సినిమాని అదిరిపోయే కథతో తీర్చిదిద్దాలని విక్రమ్‌ ప్లాన్‌ చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తుండటం విశేషం. మరోవైపు ఇది యువ సామ్రాట్‌ చైతూకి 20వ చిత్రం కావడం మరో విశేషం.