ఈ మధ్యే యువ సామ్రాట్‌ ట్యాగ్‌ తగిలించుకున్న హీరో అక్కినేని నాగచైతన్య ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌తో దూసుకుపోతున్నారు. చాలా రోజుల తర్వాత `మజిలీ`తో విజయాన్ని అందుకున్న ఆయన గతేడాది `వెంకీమామ`తోనూ ఫర్వాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం `లవ్‌ స్టోరి` చిత్రంలో నటిస్తున్నారు. జయాపజయాలతో కెరీర్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్న నాగచైతన్య బర్త్ డే రేపు(సోమవారం). ఈ సందర్భంగా అభిమానులు రెడీ చేసిన బర్త్ డే సీడీపీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

బర్త్ డే సీడీపీని మామ విక్టరీ వెంకటేష్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుకోగా, అది ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. `జోష్‌` చిత్రంతో హీరోగా కెరీర్‌ని ప్రారంభించిన నాగచైతన్య `ఏ మాయ చేసావె`, `100% లవ్‌`, `మనం`, `ప్రేమమ్‌`, `మజిలీ`, `వెంకీమామ` చిత్రాలతో విజయాలను అందుకున్నారు. 18 సినిమాల్లో నటించగా, కేవలం ఆరు సినిమాలే విజయాలను సాధించాయి. అయినా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేమైన ఇమేజ్‌ని, గుర్తింపుని సొంతం చేసుకున్నారు. 

ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో `లవ్‌స్టోరి` చిత్రంలో నటిస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతోపాటు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే.