లవ్ స్టోరీస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లతో మంచి హిట్స్ అందుకున్న యువ హీరో నాగచైతన్య ఈ సారి ఒక సవ్యసాచి అనే అనే ప్రయోగాత్మకమైన చిత్రంతో హిట్టందుకోవాలని కోరుకుంటున్నాడు. తనకు ప్రేమమ్ లాంటి బాక్స్ ఆఫీస్ హిట్టిచ్చిన దర్శకుడు చందుమొండేటి ఈ సవ్యసాచి సినిమాను తెరకెక్కించాడు. 

ఇకపోతే ఆ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానున్న సందర్బంగా నాగచైతన్య ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబందించిన విషయాలను తెలియజేశాడు. మొదట ఈ కథ యొక్క మెయిన్ పాయింట్ వినగానే చైతూకు రిస్క్ అనిపించిందట. కానీ చందూ కథను రాసిన విధానానికి ఫిదా అయ్యాడట. 

చైతూ మాట్లాడుతూ.. ప్రేమమ్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు చందు ఈ కథ మెయిన్ పాయింట్ ను చెప్పాడు. ఒక వ్యక్తికి తన చేయి తన కంట్రోల్ లో ఉండకపోవడంతో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అలాగే దానికి అద్భుతమైన శక్తులు ఉండటం అనే పాయింట్ బావుంది. కానీ అది తెరపైకి తేవడం అనేది రిస్క్ తో కూడుకున్న పని. 

అయితే చందూ రెండు షెడ్యూల్స్ పూర్తి చేయగానే సినిమా మీద చాలా నమ్మకం ఏర్పడింది.  తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా అని చైతు తన వివరణ ఇచ్చాడు. ఇక సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి మైత్రి మూవీ మేకర్స్ కారణమని చెబుతూ కీరవాణి గారు సంగీతంతో పాటు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని నాగ చైతన్య తెలియజేశారు.