నాగచైతన్య, సమంత వృత్తి పరంగా తమ మధ్య ఎలాంటి ఈగోలు ఉండవని, ఒకరి సక్సెస్ కోసం మరొకరం ప్రార్ధిస్తుంటామని చెబుతుంటారు. బహుశా వీరిద్దరికి మధ్య ఎలాంటి సమస్య లేదేమో కానీ వీరి వద్ద పని చేసే పెర్సనల్ స్టాఫ్ కి మాత్రం ఈగో క్లాషెస్ వచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయంలోకి వస్తే.. సమంతకు, నాగచైతన్యకి సెపరేట్ గా స్టాఫ్ ఉన్నారు. డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, మేకప్ ఇలా ఒక్కొక్క పనికి ఒక్కొక్కరు ఉంటారు. సమంతకి తన పెర్సనల్ స్టాఫ్ తో మంచి బాండింగ్ ఉంది. ఎంతలా అంటే వారి పుట్టినరోజులకు, ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చినా.. వారికి ఖరీదైన బహుమతులు ఇస్తుంటుంది.

దీంతో వారు కూడా సమంతపై ఎంతో ప్రేమ పెంచుకున్నారు. ఈ మధ్య 'మజిలీ' సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాలో సమంత బాగా చేసిందా..?  చైతు బాగా చేశాడా..? అనే విషయంపై చైతు స్టాఫ్ కి, సమంత స్టాఫ్ కి మధ్య చిన్న చర్చ నడిచిందట.

అది కాస్త రెండు గ్రూప్ ల మధ్య గొడవకి దారి తీసింది. విషయం చైతు వరకు వెళ్లడంతో ఆయన సమంత స్టాఫ్ లో ఒకరిని పనిలో నుండి తీసేశారు. దాంతో రంగంలోకి దిగిన  సమంత పరిస్థితిని అదుపులోకి తెచ్చిందట. సినిమా ఇండస్ట్రీ అనేకాదు.. భార్యా, భర్తలు కలిసి కట్టుగా పని చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి.