రీసెంట్ గా 'మజిలీ' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు  నాగచైతన్య. తన కెరియర్లోనే ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టడంతో చైతు ఫుల్ జోష్ తో వున్నాడు.  ప్రస్తుతం తన సొంత మేనమామ వెంకటేష్ తో కలిసి  'వెంకీమామ' షూటింగులో పాల్గొంటున్నాడు.బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫుల్‌స్పీడ్‌తో షూటింగ్‌ జరుపుకుంటోంది. మరో వైపున ఆ తరువాత ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఈ  సినిమా ఉండబోతోంది. ఆల్రెడీ అజయ్, చైతూ మధ్య స్టోరీ డిస్కషన్స్‌ కూడా నడుస్తున్నాయి. అజయ్‌ చెప్పిన స్టోరీ లైన్‌కు ఇంప్రెస్‌ అయిన చైతూ ‘వెంకీ మామ’ సినిమా తర్వాత ఈ సినిమానే స్టార్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నాడట. మహా సముద్రం టైటిల్తో రూపొందే ఈ చిత్రానికి చై సై అన్నారనే వార్త బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్‌ బ్యానర్‌పై పి. కిరణ్‌ నిర్మించనున్నారట.

సముద్రం నేపథ్యంలో జరిగే మాఫియా కార్యకలాపాలకు సంబంధించిన కథతో ఈ సినిమా ఉంటుందనీ, ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చైతూ కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలోను ఆయన సరసన సమంతను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అలా అయితే మజిలీ చిత్రం తర్వాత ఈ కాంబో మరోసారి జనాలని ఆకట్టుకోబోతోందన్నమాట.